Sunday, December 25, 2022

Rat and Cat Story -ఎలుక పిల్లి కధ -panchatantra stories

 Rat and Cat Story -ఎలుక పిల్లి

గంగానది తీరంలో ఓ పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో విషకర్ణుడు అనే ఒక పిల్లి ఉండేది. ఆ చెట్టు కింద ఉన్న కొలువులో సుబుద్ధుడు అనే ఒక ఎలుక ఉంది. ఆ రెండిటి మధ్య జాతిరీత్యా శత్రుత్వం ఉంది. కనుక ఎలుక సాధ్యమైనంత వరకూ పిల్లి కంటపడకుండా జాగ్రత్త పడేది.

Rat and cat storys


ఒక నాడు రాత్రిపూట వేటగాడు అడవి జంతువుల కోసం ఆ చెట్టు కింద వలపన్ని వెళ్లిపోయాడు. ఉదయం నిద్ర లేచి నా పిల్లి ఒళ్ళు విరుచుకుంటూ ఆహారం కోసం చెంగు మంటూ బయటకు దూకింది. క్రింద ఉన్నా వల గురించి దానికి తెలియకపోవటం వల్ల ఆ వలలో చిక్కుకుపోయింది.

వలలోనుంచి బయట పడటానికి గింజుకుంటూ " రక్షించండి...... రక్షించండి.. " అని అరవసాగింది. ఆ అరుపులు విన్న ఎలుక కలుగులోంచి బయటకు వచ్చి వలలో చిక్కుకున్న పిల్లిని చూసి హమ్మయ్య!" అంటూ సానుభూతిగా పలకరించింది.

ఎలుక మాటలకూ పిల్లి ఏడుస్తూ " మిత్రమా నన్ను రక్షించు! అంటూ ప్రాధేయపడింది".

అయ్యో ! జాతి రీత్యా మనమిద్దరం శత్రువులను. నిన్ను రక్షిస్తే నువ్వు నన్ను చంపేస్తావు.... కోరి కోరి ప్రాణాల మీదకి తెచ్చుకునే ం తా మూర్ఖురాలు నీ కాదు" అంటూ దీని తిక్క బాగా కుదిరింది అని అక్కడక్కడే తిరుగుతూ ఆనందంగా నృత్యం చేయసాగింది.

ఇంతలో ఒక కాకి వచ్చి చెట్టుమీద వాలింది. దాన్ని చూసినా ఎలుక వెంటనే పిల్లి వల దగ్గరకు చేరి కోరుకుతున్నట్లు నటించింది. కొంతసేపు కాకి ఎలుక వల దగ్గర్నుంచి ఇవతలకి రాకపోవటంతో విసుగొచ్చి ఎగిరిపోయింది. కాకి ఎగిరి పోగానే ఎలుక మళ్లీ ఇవతలకు వచ్చి ముత్యం చెయ్యసాగింది.

అప్పుడు పిల్లి " మిత్రమా! వలను కొరకకుండా వదిలేసావ్ ఏం..?" అంది.

" ఓసి పిచ్చి మార్జాల మా! ఇంతకుముందు ఒక కాకి వచ్చి వాలింది. అది నన్ను పట్టుకుపోయి చంపి తినాలని కూర్చుంది. అందుకే నేను నీ వల కోరుతున్నట్లు నటించాను. నేను నీ దగ్గర ఉండగా అదీ నా దగ్గరకు రావటానికి సాహసంచదు. ఎందుకంటే దానికీ నువ్వంటే భయం " అంటూ అసలు విషయం చెప్పి వల చుట్టూ గిర గిర తిరగసాగింది.

కొంతసేపటికి వేటగాడు వల వైపు వస్తు కనిపించాడు. అప్పుడు ఎలుక వలను కొరికి పిల్లిని రక్షించింది. అప్పుడు పిల్లి. " నేను నీకు శత్రువుని అన్నావు, మరి ఇప్పుడెందుకు రక్షించావు" అని అడిగింది. దానికీ ఎలుక నవ్వి " మనకి ప్రాణం దానం చేసినవాళ్లు ఎవరైనా వాళ్లకీ అవసరమైనప్పుడు వాళ్లకీ ప్రాణ దానం చేయాలి. కాకి నన్ను ఎత్తుకు పోకుండా నిన్ను అడ్డం పెట్టుకొని నా ప్రాణాలను కాపాడుకుంటాను. అందుకే నిన్ను రక్షించాను. " అంటూ వివరించింది.

" మిత్రమా! నా ప్రాణాలు కాపాడావు. మా ఇంటికి వచ్చి విందు స్వీకరించు.!" అంది పిల్లి ఎలుక తో "వద్దు మిత్రమా !" మీ ఇంటి కీ నే వస్తే నువ్వు నాకు విందు అవ్వటం కాదు నన్ను విందు చేసుకుంటావు." అంటూ కలుగు లోనికి తుర్రుమంది. శత్రువులతో స్నేహం చెయ్యకూడదు. అవసరమైనా సమయంలో శత్రువులతో తాత్కాలికంగా స్నేహం చెయ్యాలి కానీ శాశ్వతమైన మైత్రి చేయరాదు అన్నది ఈ ఈ కథలోని నీతి.

 

Doctor Jokes in Telugu-డాక్టర్ జోక్స్ తెలుగు

 Doctor Jokes-డాక్టర్ జోక్స్ తెలుగు

1." మీ టేబుల్ పైన చాలా పుస్తకాలు ఉన్నాయి. పేషెంట్లు చదవడానికి ఉంచారు అనుకుంటా!" అన్నాడు రాము.

" కాదండి అవి పేషెంట్లు నా దగ్గరకు వచ్చేవరకూ నాకు బోర్ కొట్టకుండా ఉండడానికి.. " అసలు విషయం చెప్పి నాలుక కరుచుకున్నాడు డాక్టర్.

2. ఒక చోట బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి.

"ఊ... కొట్టు కొట్టు! దెబ్బకి పళ్ళన్నీ రాలిపోవాలి!" అన్ని అరుస్తున్నాడో వ్యక్తి.

" మీకు బాక్సింగ్ అంటే చాలా ఇష్టం అనుకుంటా?" అన్నాడు పక్కనున్న వ్యక్తి.

అబ్బే.... నేను పక్క వీధిలో ప్రాక్టీస్ చేసే డెంటిస్ట్ని చెప్పాడా వ్యక్తి.

3." మీ ఆవిడ కి ఇది ఎన్నో కాన్పు?" అడిగింది నర్స్

" నాకు తెలిసి మా పెళ్లి అయినా తర్వాత ఇదే మొదటి కాన్పు!" అన్నాడు వంశీ

4. "జనాభా నియంత్రణలో భాగంగా మీ వంతు కృషిగా ఏం చేస్తున్నారు?"

ఓ ప్రసిద్ధి డాక్టర్ ని అడిగాడు మిత్రుడు.

" బిల్లు ఎక్కువ వేస్తున్నా, అది చూసి పిల్లల్ని కన్నడం మానేస్తున్నారు. "

చెప్పాడు డాక్టర్.

5. " ఆపరేషన్ థియేటర్లో పూలదండ ఎందుకు పెట్టారండి?" అడిగాడు పేషెంట్ అమాయకంగా.

"ఆపరేషన్ సక్సెస్ అయితే డాక్టర్ గారికి వేయడానికి, ఫెయిల్ అయితే నీకు వేయడానికి.." చెప్పి నాలిక కరుచుకుంది నర్స్.

6." మీ ఇంట్లో పని మనిషి లేదన్నారు గా! అయిన మీ వాళ్ళు కాస్త కూడా తగ్గలేదు ఏమిటి?" లక్ష్మీ నీ ఆశ్చర్యంగా అడిగింది డాక్టర్.

" పని మనిషి లేదన్నారు కానీ మా ఆయన లేరని చెప్పలేదుగా డాక్టర్" బదులిచ్చింది లక్ష్మీ.

7. " డాక్టర్! ఈ ఆపరేషన్లో నేను బతికి బయటపడగలనటరా? " అడిగాడు పేషెంట్ భయంగా

" ఏం! నీకు ఒక్కడికే అనుమానమా?" అడిగాడు డాక్టర్ కృష్ణ.

8. "మా తాతగారు కి వందేళ్లు అయినా ఆయనెప్పుడూ కళ్ళజోడు వాడలేదు ! " చెప్పాడు హరి.

" అబ్బా... ఆయన కళ్ళు అంత మంచి వా? ఆశ్చర్యంగా అడిగాడు గిరి."

" అదేం కాదు ఆయన పుట్టుగుడ్డి...." అసలు విషయం వివరించాడు హరి.

 

Vankaya Kuraku Dasudanu Kadu-Panchatrantra kadhalu-వంకాకాయ కూరకు దాసుడను కాను

 వంకాకాయ కూరకు దాసుడను కాను-పంచతంత్ర కధలు

ఒకనాడు అక్బర్ చక్రవర్తి బీర్బల్ను చూసి వంకాయ కూర బాగుంటుంది కదా! ఈరోజు నా ఈ కూర చాలా బాగా చేసారు అన్నాడు.

అవును ప్రభువు! వంకాయ కూర అంటేనాకు చాలా ఇష్టం. అందులో మసాలా చేర్చి వండితే ఎంతో బాగుంటుంది. పేరు చెబితేనే నోరుఊరుతుంది. అందుకే ప్రభూ! వంకాయ మీద ఒక సామెత కూడా ఉంది. అన్నాడు బీర్బల్.

brinjal


ఏమిటది? అని ప్రశ్నించాడు అక్బర్ చక్రవర్తి.

భగవంతుడు ఈశ్వరుని గుర్తిస్తారు కదూ! తమకూ శంకరుని వంటి దైవం, వంకాయ కూర వంటి కూర ప్రపంచంలో లేదని సామెత. శంకరుడు అంటే ఈశ్వరుడే గా ప్రభు అన్నాడు బీర్బల్. చేసిన

చక్రవర్తి మందహాసంతో చూసి ఇలా అన్నాడు బీర్బల్ ఇదివరకు ఓసారి వంకాయి కూర తిన్నాను. తర్వాత రెండు రోజులూ శరీరమంతా దురద పుట్టింది అయ్యా అని అన్నాడు.

ఇది నిజమా ప్రభూ! వంకాయ కూర చాలా చెడ్డది. అందుకే భగవంతుడు దాని ఒళ్ళంతా నీలం తో కలిసిన నలుపు చేశాడు. అన్నాడు బీర్బల్.

అక్బర్ చక్రవర్తి ఆ మాటలకూ నవ్వుతూ బీర్బల్.. వంకాయలను నేను పొగిడితే నువ్వు అంత కంటే ఎక్కువ పొగిడావు. నేను నిందించి తే నువ్వు నిందించావు. ఏమిటయ్యా ఈ మాటలు అని అడిగాడు.

ప్రభు! నేను మీ మాట లను అందులోని నీతిని ప్రపంచానికి తెలియపరచ వాడను. అంతేగాని వంకాయ కూర ఎట్లా ఉంటే నాకేం. నేను వంకాయ కు దాసుడను కాను... మీకు దాసుడను అని వినయంగా విన్నవించుకున్నాడు.

బీర్బల్ సమయస్ఫూర్తి కి అతని చమత్కారానికి చక్రవర్తి, సభలోని అందరూ ఎంతో ఆనందించారు.

 

Kothi Dulam-panchatantra kadhalu-

కోతి దూలం-పంచతంత్ర కధలు 

పిల్లలు శ్రుతించిన అల్లరి చేస్తే దానిని పెద్దవాళ్ళు కోతి చేష్టలు అంటారు. ఈ కోతి చేష్టలు ఎవరికి ఉపయోగపడవు. సరికదా అప్పుడప్పుడు ప్రాణాలు తీసే ప్రమాదాలు తెచ్చి పెడతాయి.

పనికిరాని పనులు జోలికి పోవటం ఎంత ప్రమాదకరమో ఈ కథలో మనం తెలుసుకుందాం.

పూర్వం రామాపురం అనే పట్టణంలో శోభ దత్తుడు అనే వైశ్యుడు ఉండేవాడు. అతను పట్టిందల్లా బంగారం అన్నట్లు వ్యాపారంలో బాగా కలిసి వచ్చి కొద్ది కాలంలో ఆ పట్టణంలో మొత్తంలోనే ఏకైక ధనవంతుడు అయ్యాడు.

పంచతంత్రకధాలు


శోభ దత్తుడికి అన్నీ ఉన్నా ఒకే ఒక లోటు. అతని తరువాత తను సాధించిన ఆస్తిని అనుభవించడానికి సంతానం లేదు. ఒకరాత్రి శోభ దత్తుడి కలలో రాముడు కనిపించి ఊరి చివర ఉన్న రామాలయాన్ని బాగు చేస్తే శోభ దత్తుని కి సంతానం ఇస్తానని మాట ఇచ్చాడు.

మర్నాడు సోమదత్తుడు ఆ రామాలయం బాగుచేయడానికి కొంతమంది పనివాళ్లను నియమించి. వాళ్లకీ సౌకర్యాలను సమకూర్చాడు. చెదలు పట్టి విరిగిపోయి నా దూలాల స్థానంలో కొత్త దూలాల ని అమర్చడానికి పనివాళ్లను మంచి జాతి టేకు దుంగలను ఆలయంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో రంపంతో కొయ్యటం మొదలుపెట్టారు. దేవాలయంలోని చెట్ల మీద ఉన్నా కోతులు దొంగ నూ రంపం కోస్తున్నప్పుడు వచ్చే వింత శబ్దం విని ఇదేదో భలే బాగుంది అనుకున్నాయి మన.

మధ్యాహ్నం అయింది పనివాళ్ళు అందరూ భోజనాలకు బయలుదేరారు. అప్పటివరకూ రంపంతో నిలువుగా కోసిన దొంగ కలిసిపోకుండా మధ్యలో ఒక మేకును అడ్డంగా కుట్టి వెళ్లిపోయారు వాళ్ళు. పనివాళ్ళు భోజనానికి వెళ్ళగానే చెట్ల మీద కోతులు కిందకు దిగాయి అక్కడ ఉన్నా రంపం అందుకుని పనివాళ్ళు కోసినట్లు దొంగను కొయ్యాల నీ ప్రయత్నాలు మొదలు పెట్టారు.

దొంగ మధ్యలో పనివాళ్ళు కొట్టినా మీకు అడ్డంగా ఉంది. కాసేపు కోతులన్నీ ఏం చేయాలో..? అని బుర్రలు గో కున్నాయి. ఒక కోతి ఆ మేకును అడ్డంగా తీసేస్తే సరిపోతుందని సలహా ఇచ్చింది. ఆ సలహా మిగతా కోతులు అన్నిటికీ నచ్చింది.

ఆ కోతులు గుంపులో బలమైన కోతి ముందుకు వచ్చి ఆ మేకును తాను లాగుతనంది. మిగతా కోతులు దానికి జయజయ ధ్వనులు చేశాయి. ఆ కోతి మిగతా కోతులు వంక గర్వంగా చూసి చీలిఉన్న దూలం మధ్యలో కూర్చొని రెండు చేతులతో మేకుని పట్టుకొని బలంగా పైకి లాగింది.

మరుక్షణం రెండుగా చీలి ఉన్న దూలం దగ్గరకు అతుక్కుపోయింది. మధ్యలో కూర్చున్న కోతి దెబ్బకి చచ్చిపోయింది.

అందుకే! పనికిమాలిన పనులు ఎప్పుడూ ప్రాణాంతకం అనేది ఈ కథ ద్వారా తీసుకోవాల్సిన నీతి.

 

Saturday, December 24, 2022

Nuclear Power Plants in India-భారత దేశంలో అణు విద్యుత్ కేంద్రాలు-General Knowledge

న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా


ఈరోజు బ్లాగ్లో బారత దేశంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాలు వాటి సామర్ధ్యం మరియు వాటిని ఎపుడు స్ధాపించరు. వాటి విషయాలు గురించి తెలుసుకుందాం.


serial no. అణు విద్యుత్ కేంద్రం స్టేట్ Type capcity స్ధాపించిన తేది
1 తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం-1 Maharastra BWR 160 28, October 1969
2 తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం-2 Maharastra BWR 160 28, October 1969
3 రబత్ బటా అణు విద్యుత్ కేంద్రం-1 Rajasthan PHWR 100 16, Decembar 1973
4 రబత్ బటా అణు విద్యుత్ కేంద్రం-2 Rajasthan PHWR 200 1, April 1981
5 మద్రాస్ అణు విద్యుత్ కేంద్రం-1 Thamilnadu PHWR 220 27, Januavary 1984
6 మద్రాస్ అణు విద్యుత్ కేంద్రం-2 Tamilnadu PHWR 220 21, March 1986
7 సర్వరా అణువిద్యుత్ కేంద్రం-1 Uttarpradesh PHWR 220 1, Januavary 1991
8 సర్వరా అణువిద్యుత్ కేంద్రం-2 Uttarpradesh PHWR 220 1, July 1992
9 కాక్రపరా అణు విద్యుత్ కేంద్రం-1 Gujarath PHWR 220 16, November 2000
10 కాక్రపరా అణు విద్యుత్ కేంద్రం-2 Gujarath PHWR 220 1, September 1995
11 కైగా అణు విద్యుత్ కేంద్రం-1 Karnataka PHWR 220 16, November 2000
12 కైగా అణు విద్యుత్ కేంద్రం-2 Karnataka PHWR 220 16, March 2000
13 కైగా అణు విద్యుత్ కేంద్రం-3 Karnataka PHWR 220 16, March 2000
14 రబత్ బటా అణు విద్యుత్ కేంద్రం-3 Rajasthan PHWR 220 01, Januavary 2000
15 రబత్ బటా అణు విద్యుత్ కేంద్రం-4 Rajasthan PHWR 220 23, December 2000
16 తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం-3 Maharastra PHWR 540 12, September 2005
17 తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం 1 Maharastra PHWR 540 18, August 2005
18 కల్పకం అణు విద్యుత్ కేంద్రం-1 Tamilnadu PHWR 220 1970
19 కల్పకం అణు విద్యుత్ కేంద్రం-2 Tamilnadu PHWR 220 1970

Friday, December 23, 2022

How to Make Punjabi Baingan-పంజాబి వంటలు

 పంజాబీ బైంగన్ తయారీ

ఈ రోజు బ్లాగ్ లో మనం పంజాబీ బైంగన్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం . పంజాబీ బైంగాన్ తయారీ కావలసిన పదార్థాలుపదార్థాలు చూద్దాం.

How to Make Punjabi Baingan పంజాబీ బైంగాన్ కావలసిన పదార్దాలు

గుండ్రటి చిన్న వంకాయలు -10 లేద 12

జిలకర్ర -అర టీ స్పూన్

కొత్తిమీర తరుగు -పావు టీ స్పూన్

నూనె -3 టేబుల్ స్పూన్

మసాలా కోసం

మెంతులు-అర టీ స్పూన్

యాలకులు బిర్యానీ ఆకులు -రెండు చొప్పున

దాల్చిన చెక్క -పెద్దది

ధనియాలు పావు- టీ స్పూన్

జీలకర్ర, అల్లం ముక్కలు -టీస్పూన్ చొప్పున

ఉల్లిపాయ ముక్కలు-పావు టీ కప్పు

ఎండుమిర్చి నానబెట్టినవి -ఐదు

పసుపు -అర టీ స్పూన్

ఆమ్ చూర్  పొడి- అర టీ స్పూన్

టమోటా ముక్కలు- అర కప్పు

నూనె -పావు కప్పు

ఉప్పు తగినంత

 How to Make Punjabi Baingan పంజాబీ బైంగన్ తయారీ విధానం

ü ముందు మసాలా తయారుచేసుకోవాలి. బాణాలిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ ,టమోటా ముక్కలు, ఎండు మిర్చి తప్పా మసాలా కోసం పెట్టుకున్న మిగిలిన పదార్థాలన్నీ వేసి వేయించుకొని మిక్సీలో తీసుకోవాలి.

ü అందులో ఎండుమిర్చి తగినంత ఉప్పు, ఉల్లిపాయ టమోటా ముక్కలు వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి

ü ఇప్పుడు వంకాయలు విడిపోకుండా నాలుగు భాగాలుగా వచ్చేలా కోసి ఆ మిశ్రమాన్ని వాటిల్లో కూర్చోవాలి.

ü బాణలిలో మిగిలిన నూనె వేడి చేసి జీలకర్ర వేయించాలి.

ü అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేయించి వంకాయలను ఒక్కొక్కటిగా ఉంచాలి

ü పైన మిగిలిన మసాలా కూడా వేసి పావు కప్పు నీళ్లు పోసి మంట తగ్గించాలి విడిపోకుండా మధ్యలో లో కలుపుతూ ఉంటే కాసేపు కూర తయారవుతుంది. అప్పుడు దించేసి కొత్తిమీరతో వేస్తే చాలు నోరూరించే పంజాబీ బైగన్ తయార్.

టిప్స్

1.తులసి చెట్టులోని అన్ని భాగాలు ( వేళ్లతో )ఎండించి చూర్ణంచేసి రోజుచిటికెడంత పొడిని వేడి వేడి నీటిలో కలుపుకొని తాగితే రక్తం శుభ్రపడుతుంది.

2. తులసి ఆకుల్ని మెత్తగా నూరి శరీరానికి రాసుకుని పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మ వ్యాధులు నయమవుతాయి.


Thursday, December 22, 2022

General Knowledge for APPSC EXAM-వ్యక్తులు-బిరుదులు-మారుపేర్లు

 వ్యక్తులు-బిరుదులు-మారుపేర్లు

ఆంధ్ర కేసరి-టంగుటూరి ప్రకాశం పంతులు

ఆంధ్ర రత్న-దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

ఆంధ్ర పితామహ -మాడపాటి హనుమంతరావు

ఆంధ్ర శివాజీ-పర్వతనేని వీరయ్య చౌదరి

ఆంధ్ర తిలక్-గాడిచర్ల హరిసర్వోత్తమ రావు

ఆంధ్ర భీష్మ-న్యాపక సుబ్బారావు

ఆంధ్ర వాల్మీకి-వావిలకొలను సుబ్బారావు

దేశభక్తి-కొండా వెంకటప్పయ్య పంతులు

అమరజీవి ఆంధ్రరాష్ట్ర పితా-పొట్టి శ్రీరాములు

బ్రహ్మర్షి-రఘుపతి వెంకటరత్నం నాయుడు

మహర్షి-బులుసు సాంబమూర్తి

నాదబ్రహ్- త్యాగరాజు

దక్షిణ భారతదేశ విద్యా సాగరుడు- కందుకూరి వీరేశలింగం పంతులు

ఆంధ్ర వైతాళికుడు వీరేశలింగం పంతులు

గజ్జ తిక్కన కందుకూరి వీరేశలింగం పంతులు

పునర్వికాస పితామహుడు కందుకూరి వీరేశలింగం పంతులు

రాయలసీమ పితామహ-కల్లూరి సుబ్బారావు

మహామహోపాధ్యాయ -కొక్కొండ వెంకటరత్నం

నవయుగ వైతాళికుడు -గురజాడ అప్పారావు

హరికథా పితామహుడు -ఆదిభట్ల నారాయణదాసు

ఆదికవి-నన్నయ్య బట్టు

కవిబ్రహ్మ-తిక్కన సోమయాజి

ఉభయ కవి మిత్రుడు-తిక్కన సోమయాజి

ప్రబంధ పరమేశ్వరుడు -ఎఱ్రాప్రగడ

ఆంధ్ర కవితా పితామహుడు -అల్లసాని పెద్దన్న

ఆంధ్ర నాటక పితామహ- ధర్మవరం కృష్ణమాచార్యులు

కవిరాజు-త్రిపురనేని రామస్వామిచౌదరి

కవికోకిల-దువ్వూరి రామిరెడ్డి

అభినవ తిక్కన-తుమ్మలపల్లి సీతారామమూర్తి

చత్రపతి-శివాజీ

ఆంధ్రభోజుడు-శ్రీ కృష్ణ దేవరాయలు

యువ రాజ్యస్థాపన చార్యులు-శ్రీ కృష్ణ దేవరాయలు

సాహితీసమరాంగణ సార్వభౌమ-శ్రీకృష్ణదేవరాయ

ఆంధ్రభోజుడు-శ్రీ కృష్ణ దేవరాయలు

వాస్తుకళ ప్రభువు-షాజహాన్

మహాత్మా జాతిపిత బాపు- గాంధీ

చాచా పండిట్ జీ -జోహార్ లాల్ నెహ్రూ

నవభారత నిర్మాత -జోహార్ లాల్ నెహ్రూ

భారతదేశపు కురువృద్ధుడు దాదాభాయి నౌరోజి

లోక్నాయక్ -జయ ప్రకాష్ నారాయణ

లోకమాన్య-బాల గంగదర్ ఆధార్ తిలక్

దీనబంధు -సి ఎఫ్ ఆండ్రూస్

దేశబంధు -చిత్తరంజన్ దాస్

పంజాబ్ కేసరి-లాలాలజపతిరాయ్

రాజాజీ- సి. రాజగోపాలాచారి

అన్న-సి. ఎన్,అన్నాదురై

సరిహద్దు గాంధీ- ఖాన్ అబ్దుల్లా గఫార్ ఖాన్

బాద్ షాఖాన్-ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్

శాంతి పురుషుడు-లాల్ బహుదూర్ శాస్త్రి

గురూజీ-గోల్వాంకర్

గురుదేవ్ విశ్వకవి-రవీంద్రనాథ్ ఠాగూర్

నేతాజీ -సుబాష్ చంద్ర బోస్

కాశ్మీర్ సింహం-షేక్ మహమ్మద్ అబ్దుల్లా

భారత కోకిల-సరోజినీ నాయుడు

నైటింగేల్ ఆఫ్ ఇండియా-సరోజినీ నాయుడు

 

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...