Tuesday, December 27, 2022

Ashadabuthi -Panchtantr kadhalu -ఆషాడబుతి కధ

 
Ashadabuthi -Panchtantr kadhalu -ఆషాడబుతి కధ-Telugu stories 

మన పెద్దలు మాయమాటలు చెప్పి నమ్మకద్రోహం చేసే వారిని ఆషాఢభూతి అంటుంటారు. ఈ ఆషాఢభూతి ఈ కథలో నాయకుడు.

మాధవా పురంలో దేవశర్మ అనే సన్యాసి ఉండేవాడు. అతను ఊరి చివర ఒక ఆశ్రమం కట్టుకుని ఒంటరిగా జీవిస్తూ ఉండేవాడు. సాయంత్రం పూట ఆశ్రమానికి వచ్చిన గ్రామస్తులకు పురాణాలు నీతి కథలు, సుఖంగా జీవించడానికి ఆచరించాల్సిన ధర్మాలను చెప్పి వారిచ్చిన దక్షిణ లను పుచ్చుకునేవాడు.

దక్షిణగా వచ్చినా పండ్లను పప్పు బియ్యం లను తనకు చాలినన్ని దాచుకుని మిగిలినవి సంతలో అమ్మి డబ్బు సంపాదించేవాడు. ఆ డబ్బును బొంతలో దాచే వాడు దేవశర్మ. కొంతకాలం గడిచేసరికి దేవశర్మ దగ్గర చాలా డబ్బు పొగయింది.

దేవశర్మ ఆశ్రమానికి ఓ సాయంత్రం పూట కాలక్షేపం కోసం వచ్చినా ఆషాఢభూతి అనే యువకుడు దేవశర్మ బొంతలో డబ్బు దస్తున్న విషయం గమనించాడు. ఎలాగైనా ఆ డబ్బు ను తను సొంతం చేసుకోవాలన్నా ఆశ పుట్టింది అతనికి.

మర్నాడు ఉదయం దేవశర్మ ఆశ్రమానికి వచ్చాడు.

" ఎవరు బాబు నువ్వు?" అంటూ అడిగాడు దేవశర్మ.

" అయ్యా! నా పేరు ఆషాఢభూతి. నేను తమ శిష్యరికం చేయాలని వచ్చాను. " అంటూ సాష్టాంగ నమస్కారం చేసాడు.

ఆషాఢభూతి వినయం విదేయతలకు సంతోషించి దేవశర్మ "అలాగే! నాయనా" అన్నాడు ఆప్యాయంగా.

ఆ రోజు నుంచి ఆషాఢభూతి దేవశర్మ తోపాటు ఆశ్రమంలోనే ఉంటూ గురువుకు అన్ని పనులలో చేదోడు వాదోడుగా ఉండి కొద్ది రోజులలోనే దేవశర్మ మనసు దోచుకున్నాడు.

ఆషాఢభూతి వినయవిధేయత లకి " నాకు మంచి శిష్యుడు దొరికాడు" అనుకొని గర్వపడ్డ డు దేవశర్మ. కొద్ది రోజులు గడిచిపోయినాక ఒక నాడు పొరుగున ఉన్నా గ్రామస్తుడు ఒకడు దేవశర్మ ను తన ఇంటికి ఆహ్వానించాడు. ఆషాఢభూతి తో కలిసి ఆ గ్రామంలో వెళ్ళి ఆ గ్రామస్తున్ని ఇంటిలో భోజనం చేసి మధ్యాహ్నం సమయం దాటాక ఆశ్రమానికి తిరుగు ప్రయాణం అయ్యాడు దేవశర్మ.

గురువు గారితో పాటు నడుస్తూన్న ఆషాఢభూతి కొంత దూరం వచ్చాక "అయ్యా! గురువు గారూ! నావల్ల తప్పు జరిగిపోయింది. ఇప్పుడే సరిదిద్దు కుంటాను. " అన్నాడు బాధగా.

"ఏం జరిగింది" అని అడిగాడు దేవశర్మ కుతూహలంగా. " మనకిప్పుడు ఆదిత్యం ఇచ్చినా ఆ ఇంటి వారి దర్భ పుల్ల నా ఒంటి మీద ఉన్న బట్టలకు అంటుకుపోయి వచ్చింది. ఉండండి ఇప్పుడే వాళ్లకు ఇచ్చి వస్తాను. " అంటూ ఆషాఢభూతి తన ఒంటి మీద ఉన్నా బట్టలోంచి ఓ పుల్లను తీసి చూపించి వెనుకకు నడిచాడు. " ఆహా! నా శిష్యుడు ఎంత మంచి వాడు! పరుల సొమ్ము ను పూచిక పుల్లను కూడా ఆశించని ఉత్తముడు" అనుకుంటూ మనసులో సంతోషించాడు. ఆషాఢభూతి కొంత దూరం వెనుకకు నడిచి చేతిలోని పుల్లను ముక్కలు చేసి ప్రక్కన పారేసి వచ్చి దేవశర్మ ను కలుసుకున్నాడు. గురుశిష్యులు ఇద్దరూ ముందుకు నడిచారు.

సాయంత్రం సమయం అయింది. ఆ ఇద్దరూ చెరువు సమీపించారు. అప్పుడు దేవశర్మ ఆషాడభూతి తో. " శిష్య! నేను సంధ్యావందనం చేసుకుంటా. నువ్వు ఈ గట్టు మీద కూర్చొని ఈ బొంతను చూస్తూ ఉండు" అని చెప్పి చెరువు లోనికి దిగాడు.

ఆషాఢభూతి "అలాగే" అంటూ వినయంగా తలూపి గట్టు మీద కూర్చున్నాడు.

దేవశర్మ చెరువులోకి దిగాడు దిగి సంధ్యావందనం పూర్తి చేసుకున్నాడు. ఇంతలో రెండు అడవి మేకలు ఒకదానితో ఒకటి కొమ్ములతో పొడుచుకుంటూ తగువు లాడుకోవడం దేవశర్మ కంట పడింది.

రెండు మేకపోతులు బాగా బలిసి ఉన్నాయి. ఒకదానితో ఒకటి విపరీతమైన కోపంతో తలపడుతున్నాయి. అది చూసి దేవశర్మ ఔర ! ఈ రెండు మేకపోతులు అనవసరంగా దెబ్బలాడుకుంటూన్నాయి ! కదా" అని బాధపడుతూ చెరువుగట్టు మీదకు వచ్చాడు.

గట్టుమీద ఆషాడభూతి లేడు. అతని కాపలాకాయు మున్నా దేవశర్మ బొంత కూడా లేదు. జరిగిన మోసం గ్రహించిన దేవశర్మ నెత్తి నోరు బాదుకుంటూ ' ఆషాఢభూతి!!' అని అరుస్తూ అడవంతా కలయదిరిగాడు. కానీ ఫలితం మాత్రం శూన్యం. అప్పటికే ఆషాఢభూతి డబ్బులు ఉన్నా దేవశర్మ బొంతను తీసుకొని మరో ఊరు ఉడాయించాడు. 

కధలో నీతి:

ఆషాఢభూతి లాంటి మోసగాళ్లు ఉచితంగా వచ్చే సంపద కోసం నమ్మక ద్రోహం చేయడానికి వెనుకాడని ఈ కథ లో చెప్పే నీతి . అందుకే ఎవరిని నమ్మి మన విలువైన వస్తువులను ఇతరులకు అప్పగించ రాదు.

 

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...