వంకాకాయ కూరకు దాసుడను కాను-పంచతంత్ర కధలు
ఒకనాడు అక్బర్ చక్రవర్తి బీర్బల్ను చూసి వంకాయ కూర బాగుంటుంది కదా! ఈరోజు నా ఈ కూర చాలా బాగా చేసారు అన్నాడు.
అవును ప్రభువు! వంకాయ కూర అంటేనాకు చాలా ఇష్టం. అందులో మసాలా చేర్చి వండితే ఎంతో బాగుంటుంది. పేరు చెబితేనే నోరుఊరుతుంది. అందుకే ప్రభూ! వంకాయ మీద ఒక సామెత కూడా ఉంది. అన్నాడు బీర్బల్.
ఏమిటది? అని ప్రశ్నించాడు అక్బర్ చక్రవర్తి.
భగవంతుడు ఈశ్వరుని గుర్తిస్తారు కదూ!
తమకూ శంకరుని వంటి దైవం, వంకాయ కూర వంటి
కూర ప్రపంచంలో లేదని సామెత. శంకరుడు అంటే ఈశ్వరుడే గా ప్రభు అన్నాడు బీర్బల్. చేసిన
చక్రవర్తి మందహాసంతో చూసి ఇలా
అన్నాడు బీర్బల్ ఇదివరకు ఓసారి వంకాయి కూర తిన్నాను. తర్వాత రెండు రోజులూ శరీరమంతా
దురద పుట్టింది అయ్యా అని అన్నాడు.
ఇది నిజమా ప్రభూ! వంకాయ కూర చాలా
చెడ్డది. అందుకే భగవంతుడు దాని ఒళ్ళంతా నీలం తో కలిసిన నలుపు చేశాడు. అన్నాడు
బీర్బల్.
అక్బర్ చక్రవర్తి ఆ మాటలకూ నవ్వుతూ
బీర్బల్.. వంకాయలను నేను పొగిడితే నువ్వు అంత కంటే ఎక్కువ పొగిడావు. నేను నిందించి
తే నువ్వు నిందించావు. ఏమిటయ్యా ఈ మాటలు అని అడిగాడు.
ప్రభు! నేను మీ మాట లను అందులోని నీతిని
ప్రపంచానికి తెలియపరచ వాడను. అంతేగాని వంకాయ కూర ఎట్లా ఉంటే నాకేం. నేను వంకాయ కు
దాసుడను కాను... మీకు దాసుడను అని వినయంగా విన్నవించుకున్నాడు.
బీర్బల్ సమయస్ఫూర్తి కి అతని
చమత్కారానికి చక్రవర్తి, సభలోని అందరూ ఎంతో ఆనందించారు.
No comments:
Post a Comment