Doctor Jokes-డాక్టర్ జోక్స్ తెలుగు
1." మీ టేబుల్ పైన చాలా పుస్తకాలు ఉన్నాయి. పేషెంట్లు
చదవడానికి ఉంచారు అనుకుంటా!" అన్నాడు రాము.
" కాదండి అవి పేషెంట్లు నా దగ్గరకు వచ్చేవరకూ
నాకు బోర్ కొట్టకుండా ఉండడానికి.. " అసలు విషయం చెప్పి నాలుక కరుచుకున్నాడు డాక్టర్.
2. ఒక చోట బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి.
"ఊ... కొట్టు కొట్టు! దెబ్బకి పళ్ళన్నీ
రాలిపోవాలి!" అన్ని అరుస్తున్నాడో వ్యక్తి.
" మీకు బాక్సింగ్ అంటే చాలా ఇష్టం అనుకుంటా?"
అన్నాడు పక్కనున్న వ్యక్తి.
అబ్బే.... నేను పక్క వీధిలో ప్రాక్టీస్ చేసే డెంటిస్ట్ని చెప్పాడా
వ్యక్తి.
3." మీ ఆవిడ కి ఇది ఎన్నో కాన్పు?"
అడిగింది నర్స్
" నాకు తెలిసి మా పెళ్లి అయినా తర్వాత ఇదే
మొదటి కాన్పు!" అన్నాడు వంశీ
4. "జనాభా నియంత్రణలో భాగంగా మీ వంతు కృషిగా ఏం
చేస్తున్నారు?"
ఓ ప్రసిద్ధి డాక్టర్ ని అడిగాడు మిత్రుడు.
" బిల్లు ఎక్కువ వేస్తున్నా, అది చూసి పిల్లల్ని కన్నడం మానేస్తున్నారు. "
చెప్పాడు డాక్టర్.
5. " ఆపరేషన్ థియేటర్లో పూలదండ ఎందుకు
పెట్టారండి?" అడిగాడు పేషెంట్ అమాయకంగా.
"ఆపరేషన్ సక్సెస్ అయితే డాక్టర్ గారికి
వేయడానికి, ఫెయిల్ అయితే నీకు వేయడానికి.." చెప్పి
నాలిక కరుచుకుంది నర్స్.
6." మీ ఇంట్లో పని మనిషి లేదన్నారు గా! అయిన మీ
వాళ్ళు కాస్త కూడా తగ్గలేదు ఏమిటి?" లక్ష్మీ నీ
ఆశ్చర్యంగా అడిగింది డాక్టర్.
" పని మనిషి లేదన్నారు కానీ మా ఆయన లేరని
చెప్పలేదుగా డాక్టర్" బదులిచ్చింది లక్ష్మీ.
7. " డాక్టర్! ఈ ఆపరేషన్లో నేను బతికి
బయటపడగలనటరా? " అడిగాడు పేషెంట్ భయంగా
" ఏం! నీకు ఒక్కడికే అనుమానమా?" అడిగాడు డాక్టర్ కృష్ణ.
8. "మా
తాతగారు కి వందేళ్లు అయినా ఆయనెప్పుడూ కళ్ళజోడు వాడలేదు ! " చెప్పాడు హరి.
" అబ్బా... ఆయన కళ్ళు అంత మంచి వా?
ఆశ్చర్యంగా అడిగాడు గిరి."
" అదేం కాదు ఆయన
పుట్టుగుడ్డి...." అసలు విషయం వివరించాడు హరి.
No comments:
Post a Comment