పంజాబీ బైంగన్ తయారీ
ఈ రోజు బ్లాగ్ లో మనం పంజాబీ బైంగన్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం . పంజాబీ
బైంగాన్ తయారీ కావలసిన పదార్థాలుపదార్థాలు చూద్దాం.
How to Make Punjabi Baingan పంజాబీ బైంగాన్ కావలసిన పదార్దాలు
గుండ్రటి చిన్న వంకాయలు -10 లేద 12
జిలకర్ర -అర టీ స్పూన్
కొత్తిమీర తరుగు -పావు టీ స్పూన్
నూనె -3 టేబుల్ స్పూన్
మసాలా కోసం
మెంతులు-అర టీ స్పూన్
యాలకులు బిర్యానీ ఆకులు -రెండు చొప్పున
దాల్చిన చెక్క -పెద్దది
ధనియాలు పావు- టీ స్పూన్
జీలకర్ర, అల్లం ముక్కలు -టీస్పూన్ చొప్పున
ఉల్లిపాయ ముక్కలు-పావు టీ కప్పు
ఎండుమిర్చి నానబెట్టినవి -ఐదు
పసుపు -అర టీ స్పూన్
ఆమ్ చూర్ పొడి- అర టీ స్పూన్
టమోటా ముక్కలు- అర కప్పు
నూనె -పావు కప్పు
ఉప్పు తగినంత
How
to Make Punjabi Baingan పంజాబీ బైంగన్ తయారీ విధానం
ü ముందు
మసాలా తయారుచేసుకోవాలి. బాణాలిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ ,టమోటా ముక్కలు, ఎండు మిర్చి తప్పా మసాలా కోసం
పెట్టుకున్న మిగిలిన పదార్థాలన్నీ వేసి వేయించుకొని మిక్సీలో తీసుకోవాలి.
ü అందులో
ఎండుమిర్చి తగినంత ఉప్పు, ఉల్లిపాయ టమోటా ముక్కలు వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి
ü ఇప్పుడు
వంకాయలు విడిపోకుండా నాలుగు భాగాలుగా వచ్చేలా కోసి ఆ మిశ్రమాన్ని వాటిల్లో
కూర్చోవాలి.
ü బాణలిలో
మిగిలిన నూనె వేడి చేసి జీలకర్ర వేయించాలి.
ü అందులోనే
ఉల్లిపాయ ముక్కలు వేయించి వంకాయలను ఒక్కొక్కటిగా ఉంచాలి
ü పైన మిగిలిన మసాలా కూడా వేసి పావు కప్పు నీళ్లు పోసి మంట తగ్గించాలి విడిపోకుండా మధ్యలో లో కలుపుతూ ఉంటే కాసేపు కూర తయారవుతుంది. అప్పుడు దించేసి కొత్తిమీరతో వేస్తే చాలు నోరూరించే పంజాబీ బైగన్ తయార్.
టిప్స్
1.తులసి చెట్టులోని అన్ని భాగాలు ( వేళ్లతో )ఎండించి చూర్ణంచేసి రోజుచిటికెడంత
పొడిని వేడి వేడి నీటిలో కలుపుకొని తాగితే రక్తం శుభ్రపడుతుంది.
2. తులసి ఆకుల్ని మెత్తగా నూరి శరీరానికి రాసుకుని పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మ వ్యాధులు నయమవుతాయి.
No comments:
Post a Comment