Sunday, December 25, 2022

Kothi Dulam-panchatantra kadhalu-

కోతి దూలం-పంచతంత్ర కధలు 

పిల్లలు శ్రుతించిన అల్లరి చేస్తే దానిని పెద్దవాళ్ళు కోతి చేష్టలు అంటారు. ఈ కోతి చేష్టలు ఎవరికి ఉపయోగపడవు. సరికదా అప్పుడప్పుడు ప్రాణాలు తీసే ప్రమాదాలు తెచ్చి పెడతాయి.

పనికిరాని పనులు జోలికి పోవటం ఎంత ప్రమాదకరమో ఈ కథలో మనం తెలుసుకుందాం.

పూర్వం రామాపురం అనే పట్టణంలో శోభ దత్తుడు అనే వైశ్యుడు ఉండేవాడు. అతను పట్టిందల్లా బంగారం అన్నట్లు వ్యాపారంలో బాగా కలిసి వచ్చి కొద్ది కాలంలో ఆ పట్టణంలో మొత్తంలోనే ఏకైక ధనవంతుడు అయ్యాడు.

పంచతంత్రకధాలు


శోభ దత్తుడికి అన్నీ ఉన్నా ఒకే ఒక లోటు. అతని తరువాత తను సాధించిన ఆస్తిని అనుభవించడానికి సంతానం లేదు. ఒకరాత్రి శోభ దత్తుడి కలలో రాముడు కనిపించి ఊరి చివర ఉన్న రామాలయాన్ని బాగు చేస్తే శోభ దత్తుని కి సంతానం ఇస్తానని మాట ఇచ్చాడు.

మర్నాడు సోమదత్తుడు ఆ రామాలయం బాగుచేయడానికి కొంతమంది పనివాళ్లను నియమించి. వాళ్లకీ సౌకర్యాలను సమకూర్చాడు. చెదలు పట్టి విరిగిపోయి నా దూలాల స్థానంలో కొత్త దూలాల ని అమర్చడానికి పనివాళ్లను మంచి జాతి టేకు దుంగలను ఆలయంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో రంపంతో కొయ్యటం మొదలుపెట్టారు. దేవాలయంలోని చెట్ల మీద ఉన్నా కోతులు దొంగ నూ రంపం కోస్తున్నప్పుడు వచ్చే వింత శబ్దం విని ఇదేదో భలే బాగుంది అనుకున్నాయి మన.

మధ్యాహ్నం అయింది పనివాళ్ళు అందరూ భోజనాలకు బయలుదేరారు. అప్పటివరకూ రంపంతో నిలువుగా కోసిన దొంగ కలిసిపోకుండా మధ్యలో ఒక మేకును అడ్డంగా కుట్టి వెళ్లిపోయారు వాళ్ళు. పనివాళ్ళు భోజనానికి వెళ్ళగానే చెట్ల మీద కోతులు కిందకు దిగాయి అక్కడ ఉన్నా రంపం అందుకుని పనివాళ్ళు కోసినట్లు దొంగను కొయ్యాల నీ ప్రయత్నాలు మొదలు పెట్టారు.

దొంగ మధ్యలో పనివాళ్ళు కొట్టినా మీకు అడ్డంగా ఉంది. కాసేపు కోతులన్నీ ఏం చేయాలో..? అని బుర్రలు గో కున్నాయి. ఒక కోతి ఆ మేకును అడ్డంగా తీసేస్తే సరిపోతుందని సలహా ఇచ్చింది. ఆ సలహా మిగతా కోతులు అన్నిటికీ నచ్చింది.

ఆ కోతులు గుంపులో బలమైన కోతి ముందుకు వచ్చి ఆ మేకును తాను లాగుతనంది. మిగతా కోతులు దానికి జయజయ ధ్వనులు చేశాయి. ఆ కోతి మిగతా కోతులు వంక గర్వంగా చూసి చీలిఉన్న దూలం మధ్యలో కూర్చొని రెండు చేతులతో మేకుని పట్టుకొని బలంగా పైకి లాగింది.

మరుక్షణం రెండుగా చీలి ఉన్న దూలం దగ్గరకు అతుక్కుపోయింది. మధ్యలో కూర్చున్న కోతి దెబ్బకి చచ్చిపోయింది.

అందుకే! పనికిమాలిన పనులు ఎప్పుడూ ప్రాణాంతకం అనేది ఈ కథ ద్వారా తీసుకోవాల్సిన నీతి.

 

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...