Rat and Cat Story -ఎలుక పిల్లి
గంగానది తీరంలో ఓ పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో విషకర్ణుడు
అనే ఒక పిల్లి ఉండేది. ఆ చెట్టు కింద ఉన్న కొలువులో సుబుద్ధుడు అనే ఒక ఎలుక ఉంది.
ఆ రెండిటి మధ్య జాతిరీత్యా శత్రుత్వం ఉంది. కనుక ఎలుక సాధ్యమైనంత వరకూ పిల్లి
కంటపడకుండా జాగ్రత్త పడేది.
ఒక నాడు రాత్రిపూట వేటగాడు అడవి జంతువుల కోసం ఆ చెట్టు కింద వలపన్ని
వెళ్లిపోయాడు. ఉదయం నిద్ర లేచి నా పిల్లి ఒళ్ళు విరుచుకుంటూ ఆహారం కోసం చెంగు మంటూ
బయటకు దూకింది. క్రింద ఉన్నా వల గురించి దానికి తెలియకపోవటం వల్ల ఆ వలలో
చిక్కుకుపోయింది.
వలలోనుంచి బయట పడటానికి గింజుకుంటూ " రక్షించండి......
రక్షించండి.. " అని అరవసాగింది. ఆ అరుపులు విన్న ఎలుక కలుగులోంచి బయటకు వచ్చి
వలలో చిక్కుకున్న పిల్లిని చూసి హమ్మయ్య!" అంటూ సానుభూతిగా పలకరించింది.
ఎలుక మాటలకూ పిల్లి ఏడుస్తూ " మిత్రమా నన్ను రక్షించు! అంటూ
ప్రాధేయపడింది".
అయ్యో ! జాతి రీత్యా మనమిద్దరం శత్రువులను. నిన్ను రక్షిస్తే నువ్వు
నన్ను చంపేస్తావు.... కోరి కోరి ప్రాణాల మీదకి తెచ్చుకునే ం తా మూర్ఖురాలు నీ
కాదు" అంటూ దీని తిక్క బాగా కుదిరింది అని అక్కడక్కడే తిరుగుతూ ఆనందంగా
నృత్యం చేయసాగింది.
ఇంతలో ఒక కాకి వచ్చి చెట్టుమీద వాలింది. దాన్ని చూసినా ఎలుక వెంటనే పిల్లి
వల దగ్గరకు చేరి కోరుకుతున్నట్లు నటించింది. కొంతసేపు కాకి ఎలుక వల దగ్గర్నుంచి ఇవతలకి
రాకపోవటంతో విసుగొచ్చి ఎగిరిపోయింది. కాకి ఎగిరి పోగానే ఎలుక మళ్లీ ఇవతలకు వచ్చి
ముత్యం చెయ్యసాగింది.
అప్పుడు పిల్లి " మిత్రమా! వలను కొరకకుండా వదిలేసావ్ ఏం..?"
అంది.
"
ఓసి పిచ్చి మార్జాల మా! ఇంతకుముందు ఒక కాకి వచ్చి వాలింది. అది
నన్ను పట్టుకుపోయి చంపి తినాలని కూర్చుంది. అందుకే నేను నీ వల కోరుతున్నట్లు
నటించాను. నేను నీ దగ్గర ఉండగా అదీ నా దగ్గరకు రావటానికి సాహసంచదు. ఎందుకంటే దానికీ
నువ్వంటే భయం " అంటూ అసలు విషయం చెప్పి వల చుట్టూ గిర గిర తిరగసాగింది.
కొంతసేపటికి వేటగాడు వల వైపు వస్తు కనిపించాడు. అప్పుడు ఎలుక వలను కొరికి
పిల్లిని రక్షించింది. అప్పుడు పిల్లి. " నేను నీకు శత్రువుని అన్నావు, మరి ఇప్పుడెందుకు రక్షించావు" అని అడిగింది. దానికీ ఎలుక నవ్వి
" మనకి ప్రాణం దానం చేసినవాళ్లు ఎవరైనా వాళ్లకీ అవసరమైనప్పుడు వాళ్లకీ ప్రాణ
దానం చేయాలి. కాకి నన్ను ఎత్తుకు పోకుండా నిన్ను అడ్డం పెట్టుకొని నా ప్రాణాలను
కాపాడుకుంటాను. అందుకే నిన్ను రక్షించాను. " అంటూ వివరించింది.
"
మిత్రమా! నా ప్రాణాలు కాపాడావు. మా ఇంటికి వచ్చి విందు
స్వీకరించు.!" అంది పిల్లి ఎలుక తో "వద్దు మిత్రమా
!" మీ ఇంటి కీ నే వస్తే నువ్వు నాకు విందు అవ్వటం కాదు నన్ను విందు
చేసుకుంటావు." అంటూ కలుగు లోనికి తుర్రుమంది. శత్రువులతో స్నేహం చెయ్యకూడదు.
అవసరమైనా సమయంలో శత్రువులతో తాత్కాలికంగా స్నేహం చెయ్యాలి కానీ శాశ్వతమైన మైత్రి
చేయరాదు అన్నది ఈ ఈ కథలోని నీతి.
No comments:
Post a Comment