తెలుగు జోక్స్
1 " రైల్లో నా ఎదురు బెర్తయన నన్ను ఇబ్బంది పెడుతున్నాడు" అంటూ రైల్వే పోలీసుల కీ కంప్లైంట్ ఇచ్చింది రేష్మా.
పోలీస్ కానిస్టేబుల్ ఆమె వెంట వెళ్లి గర్జిస్తే అతను భయంగా చెప్పాడు " నేనుసలు ఆమె వంకె చూడలేదు. "
" అవును, అది నిజమే. అదే నిన్ను ఇబ్బంది పెడుతుంది" అంది రేష్మ.
2." ఏవండీ! ఇవాళ కొత్త సినిమా ఏదైనా రిలీజ్ అయిందా?" అడిగింది అన్నపూర్ణ.
" ఏం అయినట్టు లేదే , అయినా నీకు ఎందుకుకొచ్చిందా అనుమానం?" అడిగాడు పరమానందయ్య.
" ఎప్పుడూ లేనిది మనవాడు పొద్దున్నే లేచి స్నానం చేసి కాలేజీకి వెళుతున్నానని చెప్పి వెళితే అనుమానం వచ్చింది లెండి" అంది అన్నపూర్ణ.
౩." నీకు సైన్స్ లో నూటికి 90 మార్కులు వచ్చి మిగిలిన వాటిలో సున్నాలు వచ్చే ఏంట్రా?" అడిగాడు ఆచారి.
" ఏమీ లేదు నాన్న. సైన్స్ ని లేడీ టీచర్ చెబుతుంది కాబట్టి కొంచెం శ్రద్ధగా వింటాను అంతే".. చెప్పాడు పుత్రరత్నం.
4." ప్రతి నిమిషానికి ఒక్కడు చస్తున్నాడట !" అన్నాడు ఆనంద్.
" అయ్యో పాపం. ఎవరండీ అదృష్టవంతుడు ? " అడిగింది భవాని.
5. కమల, శ్రీనివాసులు సినిమా కి వెళ్లి వచ్చారు, కార్ గ్యారేజ్ లో పెట్టి, గ్యారేజ్ కి తాళం వేశాడు శ్రీనివాస్. ఇంట్లోకి వచ్చి చూస్తే కమల కనబడలేదు. ఇల్లంతా వెతికి గ్యారేజి తెరిచి చూశాడు. కారులో ఉంది కమల.
" గ్యారేజి ముసేసుంటే మాట్లాడవేం ?" కోపంగా అడిగాడు శ్రీనివాస్.
" ఎలా మాట్లాడమంటారు ? " "మీకు నాకు మధ్య మాటలు లేవు గా అంది కమల".
6. " రెండు క్షణాల లో నీ ప్రాణం పోతుంది. ఆఖరి సరిగా ఏమైనా చెప్పదలిసితె చెప్పు" అన్నాడు డాక్టర్ ధర్మరాజు.
" మీ పేరు కి ముందు 'యమ' అనే అక్షరాలు చేర్చి ఏ.. డ .. వ .. ం .. డి " అంటూ కన్నుమూసాడు పేషెంట్.
7." నేను న్యూస్ పేపర్ చదవడం మానేశానొచ్చు ! "
" ఖర్చు ఎక్కువ అయిందనే మానేశావా? "
" కాదు. ఖర్చు ఎక్కువైందని మా పక్కింటి వాళ్ళు చెప్పించుకోవడం మానేశారు! "
8." నిన్న రైల్లో సరైన కారణం చూపించినా కూడా రైల్లో చైన్ లాగినందూకు వెయ్యి రూపాయలు జరిమానా విధించారు?" అన్నాడు అజయ్
" మా పాపకి కొన్న బొమ్మ రైల్లో నుంచి కింద పడిపోయింది. దానిని తీసుకొద్దామని చైన్ లాగి రైలుని ఆపాను.. " చెప్పాడు అజయ్.