Monday, December 26, 2022

Swan and Hunter-హంస వేటగాడు-Panchatantra kadhalu

హంస వేటగాడు-పంచతంత్ర కధలు

నీ చ బుద్ధి గల స్నేహితుడి వల్ల మనకు కూడా ఆపదలు వస్తాయి. సాయం చేసే గుణం ఉన్నా వాళ్లకి చూసి ఓర్చుకోలేని వాళ్లు తమకు తెలియకుండానే ఇతరులకూ హాని చేస్తారు. అలాంటి వాడితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదాన్ని చేస్తుంది.

అలాంటి స్నేహితుడు వల్ల ప్రాణాలను పోగొట్టుకున్న హంస కథ తెలుసుకుందాం. మహేంద్ర పురంని ఆనుకొని ఉన్నా అడవి లో ఒక హంస, పావురం ఎంతో స్నేహంగా ఉండేవి. హంస పున్నమి నాటి చంద్రునిలా చల్లగా నిండుగా ఉండేది. దానికీ చేతనైనంత వరకూ ఇతర పక్షులకు సాయం చేస్తూ ఆనందంగా జీవించేది.

పావురం మాత్రం పక్షుల జాతిలో ఉత్తమ జాతి కి చెందిన హంస తనకి స్నేహితుడని, తను మంచివాడు కావడం వల్లనే ఆ హంస తనతో స్నేహం చేసిందని తన జాతి పక్షులు ముందు గర్వంగా చెప్పుకునేది.

హంస వేటగాడు-పంచతంత్ర కధలు


మహేంద్ర పురంలో ఉండే వల్లబుడు అనే వేటగాడు ఒకరోజు వేట కోసం అడవికి వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం వరకూ వెతికినా వాడికి ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఇవాళ పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశాను గాని అడవంతా బోసు పోయినట్లు ఉంది. అనుకుంటూ ఎండవేడికి తట్టుకోలేక దగ్గరలో ఉన్నా ఓ చెట్టు క్రిందకూ చేరి తన దురదృష్టానికి చింతించ సాగాడు.

ఆ చెట్టు మీద నిద్రపోతున్నా హంస క్రింద అలికిడికి నిద్రలేచి చూసింది. చెమట నిండిన శరీరంతో ఉస్సురుమంటూ చెట్టు కింద కూర్చున్నా వేటగాడు కనిపించాడు దానికీ. వాడిని చూడగానే ఆ హంసకు జాలి కలిగింది. అలసటతో ఉన్నా వేటగాడిని కాసేపు సేద తీర్చిద్దాం అనుకుంటూ తన పొడవైన రెక్క నూ విసినకర్ర మార్చింది. వాడికి గాలి విసరసాగింది. ఆ చల్లని గాలికి అలసటతో ఉన్నా వేటగాడికి నిద్ర వచ్చి ఆ చెట్టు కిందే నిద్ర పోయాడు. అదే సమయంలో అక్కడికి వచ్చి నా పావురం హంస చేస్తున్నా పని చూసి " నీది ఎంత జాలి మనసు! మనల్ని చంపటానికి వచ్చినా వేటగాడికి కష్టపడి గాలి విసురుతున్నావు . ఇలాంటి. పాపాత్ముడు కి సేవ చేయడానికి నీకు సిగ్గుగా లేదా?" అంది దానికి హంస " మిత్రమా! పరోపకారమిదం శరీరం అన్నారు పెద్దలు. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా మనకు చేతనైనంత సాయం చేయాలి " అంది.

" చెయ్య ! చెయ్య ! బాగా సాయం చెయ్యి!". అంటూ పావురం ఎగతాళిగా నవ్వుతూ సరిగ్గా వేటగాడు మోహం మీద రెట్ట వేసి తుర్రుమంటే ఎగిరిపోయింది.

ఆ రెట్ట సూటిగా పోయి వేటగాడి ముక్కు మీద పడడంతో వాడు కోపంతో కళ్ళు తెరిచి తల పైకెత్తి చెట్టు మీదకు చూశాడు. వాడికి రెక్కలను చాపి ఉన్నా హంస కనిపించింది.

వెంటనే ప్రాణం తీసి గురిచూసి హంసను కొట్టాడు. అదీ సూటిగా పోయి హంస డొక్కలో తీసుకొని దాని ప్రాణాలను తీసింది.


కధలో నీతి 

నీచ బుద్ది గల పావురం చేసిన పనికి పరోపకార బుద్ధి గల హంస. తన ప్రాణాలను పోగొట్టుకుంది. కనుక నీచ బుద్ది గల వారితో స్నేహం చెయ్యటం ప్రమాదం అన్న సంగతి తెలుసుకోవాలి.

 

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...