కోతుల కోపం-పంచతంత్ర కధలు
పూర్వం ఓ అడవిలో దగ్గరలో కొండ గుహలు ఉండేవి. ఆ గుహలలో ఓ కోతుల గుంపు ఉండేది.
వాటన్నిటికికొక రోజు ఎడారిని చూడాలని
కోరిక కలిగింది. ఎడారి ప్రాంతంలో ఉండే కష్టనష్టాలు గురించి ఆ కోతులకు కాస్తంత కూడ
అవగాహన లేదు.
ఒక రోజు ఉదయం లేచి ఆ కోతుల గుంపు ఎడారికి ప్రేయణం కట్టాయి. ఒక కోతి వాటికి
మార్గదర్శకుడిలా ఉంది ముందు దారి చూపిస్తుంది. మిగిలిన కోతులు దాని వెనుక వారుసగా
నడవసాగాయి. మధ్యానం దాకా నడిచి ఎండిపోయిన ఓ నది ప్రాంతం చేరుకున్నాయి.
ఆ నది చాలా వెడల్పైనది. రెండు మూడు మైళ్ళు మించి ఆ నది వెడల్పు ఉంటుంది. అది
ఎండిపోవడం వల్ల బీటలు వేసిన పొడి ఇసుకతో ఎత్తు పల్లలతో ఉందా ప్రాంతం. దానిని చూసిన
కోతులన్నీ అదే ఎడారిగా బావించాయి ఆ ఎడారి అవతల ఏముందో చూడాలని ఆ నదిలో నడక మెుదలు
పెట్టాయి.
అది ఎండాకాలం .. అందులోను మిట్టా
మద్యాహ్నం సమయం. క్రింద సెగలు కక్కుతున్న ఇసుక వేడికీ పైన సూర్యుడి వేడికి
కళ్ళు కలుతున్నాయి. అయిన ఆ కోతులు మెుండిగా నదిలో సగం దూరం నడిచాయి.
ఎండిపోయిన ఆ నది మద్యలో పెద్ద మర్రిచెట్లు రెండు ఉన్నాయి. వాటిని చూడగానే ఆ
కోతులకు ప్రాణం లేచివచ్చినిది. గబ గబా నెల మీద నుంచి చెట్లు పైకి చేరాయి. ఎండలో
నడిచిన అలసట వల్ల వాటికి దాహం వేస్తోంది. త్రాగుడమంటే చుట్టుప్రక్కల గుక్కెడు కూడ
మంచి నీళ్ళ కనిపించలేదు వాటికి.
అవి నీళ్ళు కోసం ఆ చెట్టు మీద కూర్చుని నాలుగువైపులా వెతుకుతుండగ దూరంగా
ఇసుకలో వాటికి నీళ్ళు ఉన్నట్లు కనిపించాయి. దానితో కోతులు పోలోమంటూ అటువైపూ
పరిగెత్తుకుంటూ వెళ్ళాయి. కానీ చెట్టు మీద నుంచి చూసినపుడు నీళ్ళు ఉన్నట్లు
కనిపించిన ప్రదేశంలో వాటికి చుక్క నీరు కనిపించలేదు దాంతో నీరసంగా చెట్టు దగ్గరకు
చేరాయి.
కొద్ది దూరంలో వాటికి
మళ్ళీ నీళ్ళు కనిపించాయి. లేని ఉత్సాహం తేచ్చుకుంటూ మళ్ళీ అక్కడికి పరిగెత్తాయి. కాని
అక్కడ కూడ వాటికి చుక్క నీరు కనిపించలేదు. మళ్ళీ ముఖం వెల్లాడేసు కుంటూ చెట్టు మీదకు
చేరాయి.
ఆ చెట్టు మీద చిటారు
కమ్మలలో ఓ అడవి పక్షి గూడు కట్టుకొని ఉంటుంది. కోతుల గుంపు చెట్టుమీదకి చెరటంతో అవి
గుడు లోపల దక్కని తలను మాత్రం బయట పెట్టి చాడుసాగింది.
కోతులు నీళ్లకోసం
పడుతున్న అవస్ధను అది అర్దంచేసుకొని వాటికి సహాయం చేయాలనుకుంది. గుడు లోంచి బయటకు వచ్చి
నీరసంగా ముఖాలు వెళ్ళడేసుకున్న కోతులు ముందువాలి ఓ అమాయకమైన కోతుల్లారా .. ! మీరు ఇసుక
ఎండవేడిని వచ్చే అవిర్లను చూసి నీరుని బ్రమపడి వాటి కోసం పెరిగెట్టటం చూశాను. వాటిని
ఎండమవులు అంటారు. అక్కడ నీరు దొరకదు వాణి కోసం వేడితే నిరాశ మిగులుతుంది. నా వెంట రండి.
మీకు తియ్యని నీరు దొరికే చోటుకు చూపిస్తా’
అంది ఆ అడవి పక్షి.
“సరే ! పద ” అంటూ
ఆ కోతులన్నీ పక్షి వెంట నడిచాయి. అక్కడికి దగ్గరలో ఓ చెట్ల మద్యనున్న తియ్యని నీళ్ళు
దొరికే చెరువు దగ్గరకులో ఓ చెట్ల మద్యనున్న తియ్యని నీరు దొరికే చెరువులో దగ్గరకు కోతులకు
తీసుకెళ్లింది ఆ పక్షి. కోతులు ఆ చెరువులో నీళ్ళు తాగి కడుపు నింపుకుంది. అనీళ్లు లేత
కొబ్బరి నీళ్ళలో తేనె కలిపినంత తియ్యగా ఉన్నాయి. కోతులు ఆ నీళ్ళు తాగి చెట్ల క్రిందకు
చేరాయి. అప్పుడు ఆ పక్షి వాటి ముందు వాలి “మిత్రులారా దాహం తీరిందా..” అంటూ అడిగింది.
అంత తియ్యని నీళ్ళు
అక్కడ ఉన్న తాము ఇసుకనెలలో కళ్ళు కలుకుంటూ నీళ్లకోసం రెండు సార్లు తిరిగిన చెప్పకుండా
ఆ తురువాత తాపీగా వచ్చి చెప్పిన ఆ అడవి పక్షి మీద ఆ కోతులకు విపరీతమైన కోపం ముంచుకొచ్చింది.
వెంటనే ఓ కోతి అడవి పిట్ట మెడను చటుక్కున పట్టుకొని “నువ్వు వేలేనడంత లేవు మేం ఇసుకలో
నీళ్ళ కోసం పిచ్చివాళ్ళాల పరుగులు పెడుతుంటే ఇక్కడ ఇంత తియ్యని నీళ్ళ చెరువు ఉందని
చెప్పకుండా వినోదం చూస్తున్నావు ?” అంటూ పుటుక్కున దాని మెడను విరిచేసింది.
“అయ్యే ! ఈ మూర్ఖులకు
సాయం చేయటంలో అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నానే” అనుకుంటూనే ప్రాణం విడిచింది. ఆ
అడవి పక్షి.
కధలో నీతి:
మూర్ఖులకు సాయం చెయ్యటంలో
ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి కనుక అలాంటి వారకి సాయం చేయాలనుకున్నప్పుడు. తగినంత జాగ్రత్తగా
ఉండటం మంచిది.
No comments:
Post a Comment