పెద్ద పులి – బాట సారి పంచతంత్ర కదలు
కృష్ణ పురం అనే
గ్రామంలో శివశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఆ చుట్టూ ప్రక్కల ఉన్న నెలుగైదు
గ్రామాలకు పురోహితుడు.
ఒక నాడు పొరుగున
ఉన్న రామాపురంలో వ్రతం చేయడాని బయలదేరాడు. కృష్ణపురం నుండి రామాపురం వెళ్ళటానికి
మద్యలో రెండు మైళ్ళ దూరం అడవి దాటి చేరుకోవాలి. ఆ అడివిలో క్రూర జంతువులు లేకపోవడం
వల్ల కృష్ణపురం గ్రామస్తులు బయం లేకుండ అడవిని దాటి వెళ్ళేవారు.
శివశర్మ అడవిలో
నాడుస్తుండగా అతనికి ఒక చెరువు గట్టుమీద దర్బాలు చేతితో పట్టుకొని కూర్చన్న
పెద్దపులి కనిపించింది. దానిని చూడగానే శివశర్మ గుండెల్లో రాయపండిది.
“భాగవంతుడా ! ఈ
అడవిలో క్రూరజాతువులు ఉండవు కదా అని
ఒంటరిగా బయలుదేరిను.. ఇపుడు ఈ పెద్దపులి కనిపించింది దీని బరీ నుంచి నన్ను
నువ్వే కాపాడాలి ” మనసులో దేవుడిని తలుచుకుంటు అనుకున్నాడు.
ఆ సమయంలోనే ఆ
పెద్దపులి శివశర్మను చడానే చూసింది. శివశర్మ కళ్ళు చేతులు భయంతో వణీకయీ “ఓ
బ్రహ్మానుడా నున్ను చూసి బయపడకు. నేను క్రూర జంతువాయిన .. ఇపుడు మాంసాహరిని కాదు.
ఇప్పటిదాకా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని భగవంతుని ప్రారదించను.. దేవుడు
ప్రత్యక్షమయ్యి ఈకంకణం ఎవరికైనా దానం చేస్తే నా పాపాపలు పోతాయియని చెప్పాడు.
అందుకే నువ్వు ఈ కంకణం తీసుకో ” అంటూ తన చేతికి ఉన్న కంకణాన్ని శివశర్మకు
చూపించింది.
అది నవరత్నాలు
పొదిగిన బంగారు కంకణం. చెట్ల ఆకులలోంచి పడుతున్న సూర్యుడి వెలుగుకి దగదగ
మెరుస్తోంది. దాన్ని చూడగానే. శివశర్మకు మనసులో ఆశ పుట్టింది “నువ్వు పులివి క్రూర
జంతువి కూడ. నీమాటలు ఎలా నమ్మాలి.”
“భలేవదివే
నువ్వు ! నేను నిజంగా క్రూర జంతువువే అయితే నువ్వు కనిపించగానే నిన్ను చంపి నీ
మాంసంతో విందు చేసుకునే దానిని. కానీ ఈ బంగారు కంకణం తీసుకోపో అంటూ ఎందుకు
చెప్పేదానిని ” అంది పెద్దపులి.
శివశర్మ ఆ
మాటలకు తృపీపడ్డాడు.
“నిజమే .. పులి
క్రూర జంతువే కనుక అయితే అది కనిపించగానే తను పారిపోయిన వెంటాడి చంపి ఉండేది. అలా
చేయలేదు కనుక ఇది నిజం పాపాల నుండి విముక్తి కోసం తాపత్రయం పడుతూ ఉండి ఉంటుంది. ”
శివశర్మ మనసులో
బయం పోయి “ఆ బంగారు కంకణం ఇటు విసురు. అది తీసుకొని నిన్ను ఆశీర్వదించి నా దారిన
నేను పోతాను. నీకు పాపవిముక్తి కలుగుతుంది ” అని చెప్పాడు. దానికి పెద్దపులి నవ్వి
“భలే బ్రహ్మణుడివయ్యా నువ్వు .. శాస్త్రాలు చదివవు అని అందరికీ చెబుతావు. నువ్వు
మాత్రం పాటించవా.. ఏదన్నా దానం తీసుకునేటప్పుడు శుబ్రంగా స్నానంచేసి దానం
తీసుకోవాలి కదా..! అందుకే నెనే దానం తీసుకునేవాళ్ళకి శ్రమ లేకుండ ఈచెరువు పక్కన
కూర్చున్నాను.. నువ్వు స్నానం చేసివచ్చి ఈ బంగారు కంకణం నా దగ్గర నుంచి దానంగా
తీసుకుని నన్ను ఆశీర్వదించు” అంది శివశర్మ ఆ మాటకి “సరే ! అలాగే “ అంటూ స్నానం
చేయటానికి చేరువులోకి దిగబోయాడు. మెత్తగా ఉన్న చెరువు గట్టున బురదనెలలో నడుం వరకు
దిగబడిపోయాడు అతను.
అది చూసి పులి
“అయ్యేయ్యే! బురదలో దిగబడి పోయావా..? ఉండు రక్షిస్తాను ” అంటూ తన కూర్చున్న చోటు
నుంచి తాపీగా లేచివచ్చి ఒడ్డున నిల్చుని శివశర్మ కంఠం దొరకాపుచ్చుకొని అతన్ని చంపి
అతని మాంసంతో విందు చేసుకుంది.
కధలో నీతి:
చూశారా ! ‘దురాశ
దుఖంనికి చేటు’ బంగారు కంకననికి ఆశపడి శివశర్మ పులిచేతిలో ప్రాణాలను
పోగొట్టుకున్నాడు. అందుకే ఎదుటి వాళ్ళు చూపించే కనుకలకు ఎప్పుడు ఆశపడరాదు.. ఎవ్వరూ
విలువైన వస్తువులను ఎదుటివాళ్ళకి ఉచితంగా ఇవ్వరు అన్న సంగతి తెలుసుకుని దురాశ
పోరాడు.
No comments:
Post a Comment