Sunday, December 11, 2022

How to Make Veg. Haseena-వెజ్ హసీనా తయారి

 How to Make Veg. Haseena-వెజ్ హసీనా 

ఈరోజు బ్లాగ్లో Veg. Haseena వెజ్ హసీనా తయారి గురించి తెలుసుకుందాం. ముందుగా Veg. Haseena-వెజ్ హసీనా తయారి కావలసిన పదార్దాలు చూద్దాం.


How to Make Veg. Haseena-వెజ్ హసీనా కావలసిన పదార్దాలు:

 1. బ్రొకోలి - 100 గ్రామ్స్

2. జూక్ నీ గ్రీన్ అండ్ ఎల్లో – 100 గ్రామ్స్

3. క్యాబేజీ - 100 గ్రామ్స్

4. ఎరుపు రంగు క్యాప్సికమ్ – ఒక్కటి

5. పసుపు రంగు క్యాప్సికమ్ – ఒక్కటి

6. ఆకుపచ్చ రంగు క్యాప్సికమ్ – ఒక్కటి

7. పచ్చిమిర్చి – రెండు

8. ఉల్లిపాయలు – ఐదు

9. టొమాటో – ఒకటి

10. జీడిపప్పులు – నాలుగు

11. జీలకర్ర – ఒక టీస్పూన్

12. గరం మసాల – అరటీస్పూన్

13. ఉప్పు – తగినంత


How to Make Veg. Haseena-వెజ్ హసీనా తయారి విదానం:

ü కూరగాయాలన్నీ సన్నగా తరగాలి, ఉల్లిపాయ గ్రేవీ కోసం పాన్ లో నూనె వేసి వేడి చేయాలి.

ü అందులో తరిగిన నాలుగు ఉల్లిపాయల ముక్కల్ని వేసి వేగించాలి.

ü అవి వేగుతుండగా జీడిపప్పు,చిటకెడు పసుపు వేయాలి.

ü అవి కూడ వేగాక చల్లార్చి మిక్స్ లో పేస్ట్ చేసుకోవాలి.

ü మరో పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి జీలకర్ర, గరం మసాల, టొమాటో ముక్కలు వేసి వేగిస్తూ, కూరగాయ ముక్కల్ని కలపాలి.

ü మంచి వాసన వచ్చేంతవరకు వేగించాలి.

ü తర్వాత ఉల్లిపాయ గ్రేవీ కలిపి సన్నని మంట మీద కూరగాయాలను ఉడికే వరకు ఉంచాలి.

ü వెజ్ హసీనా కర్రీ రెడీ రోటీ తో తింటే ఆ రుచే వేరు.


Tips:

1. ఇడ్లీ పాత్రలో అడుగున కమల ఫలపు తొక్కలు విప్పవేస్తే ఆ పాత్ర తళ తాళ లాడుతుంది.

2. దనియాలు నములుతుంటే నోటిపూత పోతుంది.

3. దానిమ్మ చిగుళ్ళును నమిలితే నోటిపూత పోతుంది.

4. దోసపండు కంటి రెప్పలకి రాస్తుంటే కళ్ళలోని ఎర్రజీరలు పోతాయి.

  

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...