Saturday, December 17, 2022

Mongoose & child-Panchatantra kadhalu-ముంగిస-పిల్లవాడు పంచతంత్ర కదలు

 

Mongoose & child-ముంగిస-పిల్లవాడు పంచతంత్ర కదలు

రామాపురంలో శివరామకృష్ణ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరటిలో ఉన్న కుంకుడు చెట్టు క్రింద కలుగు చేసుకొని ఒక ముంగిస ఉండేది. అది విష్ణు శర్మ బార్య పడేసిన చద్ది అన్నం తిని జీవిస్తూ ఉండేది.

ఒక రోజు శివరామకృష్ణ ప్రక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు. ముంగిస ఇంటిలోకి వచ్చి సరాసరి మద్యగదిలోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది. అదే గదిలో శివరామకృష్ణ బార్య వంటగదిలో పనిపాట చేసుకుంటుంది.

ముంగిస-పిల్లవాడు పంచతంత్ర కదలు


ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఓ పాము ఇంటి పై కప్పులోకి చేరింది. అక్కడ నుంచి ఉయ్యాల తాడు మీద నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లడివైపు పాక్కుంటూ రాసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగిస ఉయ్యాలవైపు చూసి పాముని గమనించింది. ఇన్నాళ్ళ నుంచీ తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి శివరామకృష్ణ బార్య ఋణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకొని క్రిందకు దూకింది.

పాము ముంగిస మద్య పోరాటం మెుదలైంది. చివరకి ముంగిస పాముని చపింది. ఆ తరువాత అది తను చేసిన పని శివరామకృష్ణ బార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది. నోటి వెంట రక్తంతో ఉన్న ముంగిసను చూస్తేనే అది తన పిల్లాడికి ఏదో హాని తలపెట్టిందని బావించింది. శివరామకృష్ణ బార్య. చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకు వేసిరింది. అదెబ్బకి పాపం ముంగిస చచ్చిపోయింది.

ఆ తరువాత వచ్చి ఉయ్యాలలో పిల్లాడు క్షేమంగా ఉండటం చూసిన శివరామకృష్ణ బార్య ప్రక్కనే చచ్చిపడి ఉన్న పాముని చూసి జరిగిన విషయం అర్దం చేసుకొని అనవసరంగా తొందర పడి ముగిశాను చంపినందుకు బడపడింది.

ఎంతవారైన తొందరపాటులో తప్పులు చేస్తుంటారు. చివరికి ఆ తప్పును తెలుసుకొని బాద పడుతుంటారు. తొందరపాటు ఎప్పుడు ప్రమాదానికి హేతువు.     

 

కధలో నీతి:

ఎంతవారైన తొందరపాటులో తప్పులు చేస్తుంటారు. చివరికి ఆ తప్పును తెలుసుకొని బాద పడుతుంటారు. తొందరపాటు ఎప్పుడు ప్రమాదానికి హేతువు.     

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...