How to Make Mushroom Butter Masala -మశ్రుమ్ బట్టర్ మసాల
ఈరోజు బ్లాగ్లో మశ్రుమ్ బట్టర్ మసాల తయారి గురించి తెలుసుకుందాం. ముందుగా
మశ్రుమ్ బట్టర్ మసాల కావలసిన పదార్దాలు గురించి తెలుసుకుందాం. మీకు ఏవంట కావాలో కామెంట్
చేయండి.
How to Make Mushroom Butter Masala-మశ్రుమ్ బట్టర్ మసాల కావలసిన పదార్దాలు:
బటర్ మశ్రుమ్-200 గ్రామ్స్
దాల్చిన చెక్క -అంగుళం ముక్క
లవంగాలు -ముడు
యాలకలు-నాలుగు
ఉల్లిపాయలు-మూడు
అల్లం -వెల్లుల్లి పేస్ట్ -2 టీస్పూన్స్
టొమాటో-ఒకటి
కారం-ఒక టేబుల్ స్పూన్
పసుపు-అర టీస్పూన్
కసూరి మేధీ -2 టీస్పూన్స్
జిడిపప్పు ముద్ద -3 టేబుల్ స్పూన్స్
తాజా క్రీమ్ - పావు కప్పు
వెన్న టేబుల్ – స్పూన్
నూనె -3 టేబుల్ స్పూన్స్
ఉప్పు -తగినంత
How to Make
Mushroom Butter Masala -మశ్రుమ్ బట్టర్ మసాల తయారి:
Ø పుట్టగొడుగుల్ని
సగమునకు కోయాలి. ఉల్లిపాయలు, టొమాటోలు ముక్కలుగా కోయాలి. జీడిపప్పులో తగినన్ని
నీళ్ళు పోసి మెత్తగా రుబ్బలి.
Ø బాణలిలో 2 స్పూన్ల నూనె
వేసి కాగాక దాల్చినచెక్క ముక్కలు, లవంగాలు, యాలకులు వేసి అర నిమిషం వేయించాలి.
తరువాత ఉలలిముక్కలు, ఉప్పు వేసి వేగాక, అల్లం, వెల్లుల్లి వేసి మరో రెండు నిమిషాలు
వేయించాలి.
Ø తరువాత టొమాటో ముక్కలు,
పసుపు, కారం కస్తూరి మెధీ వేసి, వేయించాలి దించాలి. చల్లరాక మిక్సీలో వేసి మెత్తగా
రుబ్బలి, కొద్దిగా నీళ్ళు కూడ జోడించాలి.
Ø పాన్ లో మిగిలిన నూనె
వేసి కాగాక పుట్టగొడుగుల ముక్కలు, ఉప్పు వేసి ఉడికించాలి. అందులోని నీళ్ళన్నీ
ఆవిరైపోయాక రుబ్బిన మసాల ముద్ద, అరకప్పు నీళ్ళు పోసి ఉడికించాలి.
Ø దగ్గరగా ఉడికిన తరువాత
జీడిపప్పు ముద్ద వేసి సిమ్ లో మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరిగా తాజా మీగడ.
వెన్న వేసి బాగా కలిపి దించాలి.
Tips
1. పాలు, తేనె కలిపి త్రాగితే నరాల బలహీనత తగ్గుతుంది.
No comments:
Post a Comment