Thursday, December 15, 2022

అశపోతు నక్క-పంచతంత్ర కధలు

 

అశపోతు నక్క-పంచతంత్ర కధలు

కృష్ణపురం అనే ఊరిలో రాఘవ అనే వేటగాడు ఉండేవాడు. వాడు పరమసోమరి. ఒక రోజు వేటకు వేడితే, రెండు మూడు రోజులు ఇంట్లో కూర్చునేవాడు. సోమరిపోతు ఇంట లక్ష్మీదేవి ఉండదని వాడి ఇల్లు ఎప్పుడు దరిద్రంతో వేల వేల పోతు ఉండేది. రెండు రోజులు క్రితం అడవికి వెళ్ళి పావురాలను పట్టుకొచ్చి సంతలో అమ్మితేచిన డబ్బులు అయిపోవడంతో బార్య పొరుపడలేక వేటకు బయలుదేరాడు. ఈరోజు పక్షులని కాకుండా అదన్న అడవి జంతువును పట్టుకొచ్చి అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి. దానితో ఓ వారం రోజులు పాటు వెటకి వెళ్ళకుండా హాయిగా ఇంట్లో పడుకోవచ్చు అనుకుంటూ బాణం బుజనికి వేసుకొని అడవిలోకి బయలుదేరాడు.

అశపోతు నక్క-పంచతంత్ర కధలు


మద్యాహ్నం వరకు తిరిగిన వాడికి ఒక్క అడవి జంతువు కూడ కనిపించలేదు. కడుపులో ఆకలి మెుదలైంద. దాహంతో నాలుక పిడచగట్టుకుపోసాగింది. ఎదురుగా కనిపించిన చెరువులో కడుపు నిండా నెళ్ళు తాగి కళ్ళు చేతులు కడుక్కుని ఒడ్డుమీద కొచ్చి చెట్టు క్రింద కూర్చున్నాడు.

దూరంగా ఉన్న పొదలో పచ్చగడ్డి చివుళ్ళను తింటున్న ఓ లేడిపిల్ల రాఘవకి కనిపించింది. వేంటంటే బాణంతో గురిచూసి ఆలెఢిని కొట్టాడు. బాణం దెబ్బకి ఆ లేడి పిల్ల గిలగిల తన్నుకుంటూ మరణించింది. రాఘవ తనపంట పండిందనుకుంటూ ఆనందగా ఆ లేడిపిల్లని బుజం మీద వేసుకొని ఇంటికి బయలుదేరాడు.

కొంత దూరం నడిచేసరికి అతనికి ఓ అడవి పంది కనిపించింది. దానిని చూడగానే లేడిపిల్లని క్రిందపడేసి పందిని బాణంతో కొట్టడతాను. బాణం పంది దొక్కలో బలంగా గుచ్చుకుంది. అది బదతో పెద్దగా అరుస్తూ రాఘవ మీదకి ఎగిరిదూకి తన పళ్ల తో అతని గొంతును గట్టిగా కొరికింది.

రాఘవ క్రిందపడి ప్రాణాలు విడిచాడు.

పంది కూడ క్రింద పడి గిలగిలా తన్నుకోసాగింది. అసమయాలో కడుపునిండా కప్పులను తిని నెమ్మదిగా ప్రాకుతూ పుట్టలోకి పోతున్న ఓ పాము పంది క్రింద పడి మరనినచ్చింది.

దానితో పాటు ఆ అడవి పంది కూడ మరణించింది.

ఓ నక్క ఆహారం వెతుక్కుంటూ ఆ వైపు వచ్చింది.

వేటగాడు, పాము, లేడి, పంది చనిపోయి ఉండటం చూసి “ఆహా ! నాది ఏం అదృష్టం. ఈపుట ఆహారం వెతుక్కోవటానికి నేను బయలుదేరితే నాకు నెలల తరపడి సరిపోయే ఆహారం దొరికింది.. ఈపాము నాకు రేపంత సరిపోతుంది.. అలెడి వారం వరకు సరిపోతుంది. ఆ పండితో నెల బ్రతకావచ్చు.. ఆ మనిషితో మరో నెల బ్రతకావచ్చు.. అయ్యే ఈపుటకు ఆహారం సరిపోయేది ఏది లేదే ..  ”అనుకుంటూ చుట్టూ చూసింది.

వేతగాడి ప్రక్కన పడిఉన్న బాణం కనిపించిది దానికి తీగగా కట్టినది దున్నపోతు నరం.

“ఆహా ! ఈపుటకు నాకు ఆహారంగా ఈనరం సరిపోతుంది ” అనుకుంటూ అనదంగా ఆ నారాన్ని పుట్టుక్కున కొరికింది.

మరుక్షణం..

బాణానికి వంచి కట్టిన వెదురుబద్ద వేగంగా పైకి లేచి దాని దొక్కల్లో గుచ్చకుంది. బాదలో విలవిలాలాడుతూ ప్రాణాలు విడిచింది ఆ ఆశ పోతు నక్క చూశారా! పేరాశ వల్ల ఆ నక్కా ఎలా ప్రాణాలు పోగొట్టుకున్నదో. అంధుకే ఎప్పుడైనా దొరికిన దానితో తృప్తి పడాలి కాని పేరాశ పనికి రాదు దానిని వల్ల కష్టాలు ప్రమాదాలు వస్తాయి.

కధలో నీతి:

దురాశ దుఃఖనికి చేటు.  

 

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...