How to Make Mixed Veg Curry-మిక్సడ్ వెజ్ కర్రీ
ఈరోజు బ్లాగ్లో మిక్సడ్
వెజ్ కర్రీ తయారి గురించి తెలుసుకుందాం. ముందుగా మిక్సడ్ వెజ్ కర్రీ కావలసిన పదార్దాలు
గురించి తెలుసుకుందాం.
How to Make Mixed Veg Curry-మిక్సడ్ వెజ్ కర్రీ కావలసిన పదార్దాలు:
బంగాళా దుంపల ముక్కలు
– కప్పు
బీన్స్ ముక్కలు –
కప్పు
పచ్చి బఠానీలు –
అరకప్పు
క్యాలీఫ్లవర్ ముక్కలు
– అర కప్పు
క్యారేట్ ముక్కలు
– కప్పు
గుమ్మడి కాయ ముక్కలు-
కప్పు
టమేటా ముక్కలు –
కప్పు
కొబ్బరి తురుము –
రెండు కప్పులు
ఎండు మిర్చి – నాలుగు
జీలకర్ర – టీస్పూన్
దనియాలు- టేబుల్
స్పూన్
పసుపు – టీస్పూన్
ఆవాలు – టీస్పూన్
మినపప్పు -టీస్పూన్
కర్రిపాకు – నాలుగు
రెబ్బలు
వేరు శనగ నూనె –
మూడు టేబుల్ స్పూన్స్
ఉప్పు తగినంత
How to Make Mixed Veg Curry-మిక్సడ్ వెజ్ కర్రీ తయారి:
Ø కప్పు కొబ్బరి తురుములో’గోరువెచ్చని పాలు పోసి మెత్తగా
రుబ్బి చిక్కని పాలు తీయాలి.
Ø తరువాత మారికాసిన నీళ్లు పోసి మళ్లీ రుబ్బి పలుచని
పాలు తీయాలి.
Ø చింతపండుని వేడినీళ్ళలో నానబెట్టి గుజ్జుల చేయాలి.
Ø బాణాలిలో టీస్పూన్ నూనె వేసి 2 ఎండుమిర్చి, జీలకర్ర,
దనియాలు, వెల్లుల్లి రెబ్బలు, మిగలిన కొబ్బరి తురుము వేసి వేయించాలి. తరువాత కొద్దిగా
నీళ్ళు చల్లి మెత్తగా రుబ్బలి.
Ø కూరగాయల ముక్కలు, తాజా బఠానీలు అన్నీ కూడ పలుచని కొబ్బరి పాలల్లో
ఉడికించాలి. తరువాత అందులోనే ఉప్పు, తగినన్ని నీళ్ళు పోసి ముక్కలు మూడు వంతులు ఉడికేవరకు
ఉంచాలి. తరువాత రుబ్బిన మసాల వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉండికించాలి.
Ø విడిగా బాణలిలో మిగిలిన నూనె వేసి మిగిలిన ఎండుమిర్చి,
ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసి పోపు చేసి కూరలో కలపాలి. చివరగా చిక్కని కొబ్బరి పాలు
పోసి సిమ్ లో 2 లేక 3 నిమిషాలు ఉండికించి వడ్డించాలి.
No comments:
Post a Comment