Friday, December 16, 2022

How to Make Kaju Masala-కాజు మసాలా తయారి

 How to Make Kaju Masala-కాజు మసాలా 

ఈరోజు బ్లాగ్లో కాజు మసాల ఎలా తయారి చేయాలో చూద్దాం. ముందుగా కాజు మసాల తయారి కావలసిన పదార్దాలు చూద్దాం.


How to Make Kaju Masala-కాజు మసాలా కావలసిన పదార్దాలు:

క్యాప్సికమ్ -ఆరు

ఎరుపు క్యాప్సికమ్ – రెండు

పాలు -అరకప్పు

ఉల్లిపాయలు-మూడు

వెల్లుల్లి రెబ్బలు-పదిహేను

పసుపు-టీస్పూన్

కారం-టీస్పూన్

గరం మసాల-అర టీస్పూన్

జీలకర్ర పొడి -పావు టీస్పూన్

గసగసాలు-ముప్పావు టీస్పూన్

కొబ్బరితురుము -టేబుల్ స్పూన్

జీడిపప్పు – పన్నెండు

నూనె -పావుకప్పు

ఉప్పు -తగినంత

How to Make Kaju Masala-కాజు మసాలా తయారి విదానం:

గంట  ముందుగా జీడిపప్పు, గసగసాలు నీళ్లలో నాన బెట్టుకోవాలి.

తరవాత అందులో కొబ్బరితురుము, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేసి పెట్టుకోవాలి

బాణలిలో నూనె వేడిచేసి జీలకర్ర తరువాత అందులో ఉల్లిపాయముక్కలు వేయించాలి.

అవి కూడ వేగాక క్యాప్సికమ్ ముక్కలు వేయాలి.

పసుపు, కారం, ఉప్పు, గరంమసాల, జీలకర్రపొడి వేసి బాగా కలిపి మూత పెట్టియాలి. కాసేపటికి క్యాప్సికమ్ ముక్కలు ముగ్గుతాయి.

అప్పుడు పాలు, ముందుగా చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలపాలి. కాసేపటికి గ్రేవీల తయారై నూనె వెరావుతుంది అప్పుడు దించేయాలి.

కాజు మసలా రెడీ ఇది అన్నంలొకే కాదు రొట్టెలోకి బాగుంటుంది.


Tips:

1.ఇడ్లీ పాత్రలో అడుగున కమలా ఫలపు తొక్కలు విప్పి వేస్తే ఆ పాత్ర తళ తాళ లాడుతుంది.

2. నారింజ తొక్కాలను ఎండబెట్టి పొడిచేసి, దానిలో పళ్ళు తోము కుంటే పంటిబాదలు ఉండవు.

3. నారింజ తొక్కల పొడిలో కొద్దిగా గంధపు పొడి, కొంచెం పాలు కలిపి పేస్ట్ గా చేసి, దాన్ని మెడకి, చేతులకి వ్రాసుకొని అరగంట తర్వాత కడిగి వేస్తుంటే చర్మం మృదువుగా తయారుతుంది.

4. మామిడి పండ్లు తొక్కల్ని ఎండబెట్టి వాటితో పొగవేస్తే దోమలు మీఇంటి నుండి పరిపోతాయి.  

 

 

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...