Monday, November 7, 2022

How to Make Panneer Chicken Curry & How to Make Gongura Chicken-పన్నీర్ చికెన్ కర్రీ & గోంగూర చికెన్

How to Make Panner Chicken curry పన్నీర్ చికెన్ కర్రీ

ఈ రోజు బ్లాగ్లో పన్నీర్ చికెన్ కర్రీ మరియు గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగ పన్నీర్ చికెన్ కర్రీ చూద్దాం.

పన్నీర్ చికెన్


1.పన్నర్ చికెన్ కర్రీ (
Panner Chicken Curry) కావలసిన పదార్దాలు


 1.బోన్ లెస్ చికెన్-అర కేజీ

2.పన్నర్ – 100 గ్రామ్స్

౩. కారం – టీస్పూన్

4.పసుపు – అర టీస్పూన్

5.అల్లం – అగుళం ముక్క

6.వెల్లుల్లి రెక్కలు – పది

7. పచ్చి మిర్చి -6

8.లవంగాలు -నాలుగు

9.ఉల్లిపాయలు-రెండు

10.దాల్చినచెక్క -అంగుళం ముక్క

11.యాలక్కాయలు -మూడు

12.మిరియాలు – అర టీస్పూన్

13. జీలకర్ర -టీస్పూన్

14.దనియాలు-టీస్పూన్

15.నూనె -3టీస్పూన్

16.ఉప్పు -తగినత


పన్నీర్ చికెన్ తయారి విదానం:

v చికెన్ లో కొద్దిగా నూనె, కారం, పసుపు, చిటికెడు ఉప్పు కలిపి మూతపెట్టి పక్కనుంచాలి.

v కడాయిలో దనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిచెక్క, యాలక్కాయ, అల్లం, వెల్లులి, ఉల్లి, పచ్చిమిచ్చి వేగించి అన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి.

v ఇంకొ కడాయిలో నూనె వేసి మసాల పేస్ట్, కారం, పసుపు, ఉప్పు కలపాలి.

v నూనె పైకి తేలిన తరువాత చికెన్ ముక్కల్ని వేసి బాగా కలిపి మూత పెట్టాలి.

v 10 నిమిషాలు తర్వాత అర లీటర్ నీరు పోసి చిన్న మంట పై మెత్తగా ఉడికించాలి.

v తర్వాత కొద్ది నూనెలో (దోరగా కాకుండా) వేగించి పన్నర్ కలపాలి.

v 5 నిమిషాలు తరువాత కొత్తిమీర చల్లి దించేయాలి.

v ఈ కర్రీ పరటలతో పాటు అన్నంలోకి కూడ బాగుంటుంది.

2. How to Make Gongura Chicken

గోంగూర చికెన్ (Gongura Chicken) కావలసిన పదార్దాలు:

1.చికెన్ – కప్పు

2. గోంగూర – కప్పు

3.గసగసాలు – 50 గ్రామ్స్

4.జీడిపప్పు-10 పది గ్రామ్స్

5. నూనె – సరిపడ

6.ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు

7. కారం-టేబల్ స్పూన్

8. పచ్చిమిర్చి – 4

9.పసుపు -టీస్పూన్

10. దనియాలపొడి -టీస్పూన్

11. గరం మసాల పొడి -చిటికెడు 

12. ఉప్పు -తగినంత


గోంగూర చికెన్ (Gongura chicken) తయారి విదానం:

v గసగసాలు, జీడిపప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాత్రలో నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలను వేయించిన తర్వాత అందులో పచ్చిమిర్చి, కారం, పసుపు, దనియాల పొడి, గరం మసాల పొడి ఒకదాని తర్వాత ఒకటిగా వేయాలి.

v అన్నీ వేగిన తరువాత చికెన్ వేసి తగినంత నీటిని పోసి ఉడికించాలి.

v చికెన్ ఉడికిన తర్వాత గోంగూర, గసగసాలు, జీడిపప్పు మసాల వేసి ఉడికిస్తే గోంగూర చికెన్ రెడీ.

 

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...