Latest Lovely Telugu Jokes
1.”నా కొడుక్కి
బుద్ది లేక లెక్కలు చేసిచ్చా!”
“ఏమైందేమిటి ?”
“లెక్కలన్నీ
తప్పులని నన్ను కొట్టించడానికి వాళ్ళ టీచరని ఇంటికి తీసుకొచ్చాడు.”
2. “ఇంత
మురికినీళ్ళ త్రాగడానికి ఇచ్చేది?” కోపం అడిగాడు వంశీ.
“అవి మంచినీళ్ళే
సార్. గ్లాస్ లే మురికివి ..” అన్నాడు సర్వర్.
3.”పదిమంది ఉన్న
గుంపులోకి వెళ్తే చాలు చేతులు వణుకుతున్నాయి డాక్టర్ గారు !” అన్నాడు ఒక పేషేంట్.
“దందేముందిలేండి.
గుంపులోకి వెళ్ళడం మానేస్తేసరి !” అన్నాడు డాక్టర్.
“అదెలా
కుదురుతుంది డాక్టర్ ?నేను జేబు దొంగనికదా?” అన్నాడు పేషెంట్.
4. ఇలా
దొంగతనాలు చేసి బతికే కంటే కష్టపడి బ్రతకొచ్చుగా? అడిగాడు జడ్జి.
“అంటే నేను
దొంగతనాలు చేయడానికి కష్టపడట్లేదనా మీ ఉద్దేశం ? ” అడిగాడు ముద్దాయి.
5.”మనవాడిని
మమతా పబ్లిక్ స్కూల్ల్ జాయినవ్వమంటే వనిత
పబ్లిక్ స్కూల్ జాయినవుతానంటాడేమిటి? ” అడిగాడు రాము.
“అక్కడైతే
అందమైన లేడి టీచర్స్ వుంటారు -”చెప్పింది రాణి.
6. “అదేమిటి
సార్ ! బట్టలన్నీ బ్యాంక్ లాకర్ లో పెడుతున్నారేమిటి ” ఆశ్చర్యంగా అడిగాడు బ్యాంక్
మేనేజర్.
“అలా పెట్టకపోతే
మా ఆవిడ వాటన్నింటినీ స్టీల్ సామాన్లకి
వేసేస్తుంది !”- వాపోయాడు శ్రీను.
7.”అన్నం తిని
వరమయ్యింది. ఏదైయన దర్మం చేయండి బాబు!”అడుకుతున్నాడు. భిక్షగాడు.
“చిల్లర లేదయ్యా!”
అన్నాడు అదిత్య
“ఫోన్ పే అయిన చేయండి
!” అన్నాడు భిక్షగాడు.
8.”మా ఆవిడ వచ్చే
టైమ్ అయ్యింది. ఇక వెళ్ళు సుద !” అన్నాడు రాము.
“మీ ఆవిడ మా ఆయనతో
కలసి సినిమా కెళ్లటం చుసే నేనొచ్చను, మీరేం కంగారూ పడకండి !” అది సుద
9.”పేరట్లో దానిమ్మ
చెట్టుని వేసానోయ్ ! ”
“గింజలు ఉన్నదా ?
గింజలు లేనిదా ?”
“పక్కింటి వాళ్ళ
నదిగితే తెలుస్తుంది. మెమెప్పుడైన తింటేగా. ”
10. వెదవ ! అల్లరి
పనులు చేస్తే ‘చీరేస్తా’ కోపంగా అరిచాడు తండ్రి.
వద్దు నాన్న. నేను
మగ పిల్లడిని కదా ... .’షర్ట్’ తెండి అన్నాడు కొడుకు.
11. “పరీక్ష వ్రాయకుండా
ఏడుస్తున్నావేమిటి బాబు ?” అడిగాడు ఇన్వజిలెటర్.
“నేను కష్టపడి వ్రాసి
తెచ్చుకున్న స్లిప్పులు ఎవరో కొట్టేసారు సార్. ” మరింతగా ఏడుస్తూ చెప్పాడు రాము.
12. “నీ మెడలో బంగారు
గొలుసు చాలా బాగుంది ! ఎప్పుడు కొన్నావు ?” అడిగింది గిరిజ
“కొనలేదు మా ఆయన
పరుగుపందెంలో గెలుచుకు వచ్చారు.”
“అలాగ ? ఇంతకీ ఎంతమంది
పాల్గొన్నారు అపోటీలో ?”
“ముగ్గురండి ! మా
ఆయన, పోలీసు, ఆగొలుసు యజమాని .. చెప్పి నాలిక్కరుచుకుంది లక్ష్మీ. ”
No comments:
Post a Comment