How to Make Palak prawns - పాలక్ ప్రాన్
ఈరోజు బ్లాగ్లో పాలక్
ప్రాన్స్ మరియు బ్రింజాల్ ప్రాన్స్ ఎలా తయారి చేయాలో చూద్దాం. ముందుగ పాలక్ ప్రాన్స్
చూద్దాం.
1.పాలక్ ప్రాన్స్
కావలసిన పదార్దాలు:
1.రొయ్యలు -పావు
కేజీ
(పొట్టు ఒలిచి శుబ్రం
చేసినవి)
2. పాల కూర తరుగు
– 2 కప్పులు
3. ఉల్లిపాయలు –
2
4. అల్లం వెల్లులి
పేస్ట్ – 1 ½ స్పూన్
5. కారం – టీస్పూన్
6. దనియాల పొడి –
టీస్పూన్
7. గరంమసాల పొడి
– పావు టీస్పూన్
8. పసుపు -చిటికేడు
9. పచ్చిమిచ్చి
-6
10. నూనె – 2 టీస్పూన్
11. ఉప్పు -తగినంత
పాలక్ ప్రాన్స్ (palak prawn) తయారి విదానం:
Ø ఒక టీస్పూన్ నూనెలో రొయ్యల్ని పచ్చి వాసన పోయెవరకు
చిన్ని మంట పై వేగించి పక్కనుంచలి.
Ø మరో కడాయీలో మిగతా నూనె వేసి ఉల్లి, పచ్చిమిచ్చి
తరుగు, పసుపు, అల్లం వేల్లులి పేస్ట్ 2 నిమిషాలు వేగించాలి.
Ø ఇప్పుడు రొయ్యలు, కారం, దనియాల పొడి కలిపి మరి కొద్ది
సేపు వేగించాలి.
Ø తర్వాత పాలకూర తరుగు, ఉప్పు కలిపి మూత పెట్టాలి.
Ø పాలకూర మెత్తబడ్డాక కప్పు నీటిని చేర్చి మరికొద్ది
సేపు ఉడికించాలి.
Ø రొయ్యలు ఉడికి కూర చిక్కబడ్డాక గరంమసాల పొడి వేసి
దించేయాలి.
Ø వేడి వేడి అన్నంలో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
2. How to Make Brinjal prawns - బ్రింజాల్ ప్రాన్స్
బ్రింజాల్ ప్రాన్స్
కావలసిన పదార్దాలు:
1.వంకాయలు – పావు
కేజీ
2. ఎండు రొయ్యలు
– 100 గ్రామ్స్
3.ఉల్లిపాయ – 1
4. కరివేపాకు – 2
రెబ్బలు
5.పసుపు – చిటకెడు
6. కారం – టీస్పూన్
7. కారం – టీస్పూన్
8. దనియాలు పొడి
– 1 టేబల్ స్పూన్
9.గరంమసాల పొడి –
పావు టీస్పూన్
10. అల్లం వెల్లులి
ముద్ద – 1 టీస్పూన్
11. నూనె – 4 టీస్పూన్
12. ఉప్పు – తగినంత
బ్రింజాల్ ప్రాన్స్
(Brinjal prawns) తయారి విదానం:
Ø చెంచాడు నూనెలో ఎండు రొయ్యలు దోరగా వేగించి పక్కన
పెట్టుకోవాలి.
Ø వంకాయలను ముక్కలుగా తరిగి రంగు మారకుండా ఉప్పునీటిలో
వేసుకోవాలి.
Ø ఒక కడాయిలో నూనె పోసి ఉల్లిపాయలు ముక్కలు దోరగా వేగించి
తర్వాత అంధులో పసుపు, కరిపాకు, అల్లం వెల్లులి పేస్ట్ ముద్ద, కారం వేసి కొద్దిగా వేగాక
వంకాయముక్కలు దనియాలపొడి వేసి మూత పెట్టాలి.
Ø కాసేపేయక మసాల పొడి వేగించి పెట్టుకున్న రొయ్యలు
వేసి నీళ్ళు పోసి ఇంకొంచెం సేపు ఉడికించి దింపుకోవాలి.
No comments:
Post a Comment