Tuesday, November 22, 2022

How to Make Roti Mutton – రోటి మటన్ & మటన్ కర్రీస్

 How to Make Roti Mutton – రోటి మటన్ 

ఈరోజు బ్లాగ్లో రోటీ మటన్ ఎలా తయారీ చేయాలా నేర్చకుందాం. రోటీ మటన్ కావలసిన పదార్దాలు చూద్దాం.

రోటి మటన్


How to Make Roti Mutton – రోటి మటన్ కావలసిన పదార్దాలు:

మటన్ – కేజీ

నూనె – 100 గ్రామ్స్

ఉల్లిపాయలు – పావు కిలో

దనియాల పొడి – 100 గ్రామ్స్

పసుపు – టీస్పూన్

కారం – 3 టబుల్ స్పూన్స్

కొత్తిమీర తరుగు- టేబుల్ స్పూన్

ఉప్పు – తగినంత

గరంమసాల కోసం:

యాలకులు – 4 టీస్పూన్స్

దాల్చిన చెక్క – 2 అంగుళం ముక్క

షాజీర – 2 టీస్పూన్

జాజికాయ – 1

లవంగాలు-8

మిరియాలు – 2 టీస్పూన్స్


How to Make Roti Mutton – రోటి మటన్ తయారి విదానం:

మటన్ శుబ్రంగా కడగాలి. ప్రెషర్ పాన్ లో నూనె వేసి ముక్కలు వేయాలి. తరువాత అల్లం వెల్లుల్లి, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక దనియాలు పొడి వేసి వేయించాలి.

తరువాత ఉప్పు, కారం, గరం మసాల కూడ వేసి తక్కువ మంట పై వాయించాలి.

ఇప్పుడు సరిపడ నీళ్ళు పోసి ముక్కులు బాగా ఉడికాక దించి. కొత్తిమీర చల్లాలి. ఇది చపతిలోకి బాగుంటుంది.

Kitchen Tips:

1. నిమ్మకాయాల్ని ఫ్రిజ్ లో నుండి తీసి 15 నిమిషాలు తరువాత కోయాలి.

2. వట్టి మూకుడులో వెల్లుల్లిని కొద్దిగా వేయించిన తీసిన పై పోట్టు త్వరగా వస్తూంది.

3.కోడి గ్రుడ్డు మంచి దైతే నీళ్ళలో మునుగుతుంది. చెడిన గ్రుడ్డు నీళ్లపై తేలుతుంది.

4. పగిలిన గ్రుడ్డును కొంచెం వెనిగర్ కలిపిన నీళ్ళలో ఉదకబెడితే లోపల ద్రవం బయటికి రాదు. బాగా ఉడుకుతుంది.

5. కోడి గ్రుడ్డును అల్యూమినీయం లేద వెండి పాత్రలోకి పగలగొట్ట కూడదు. అట్లచేస్తే అవి నల్లబడతాయి.

6. పచ్చి మిర్చి ని తొడిమలు తీయకుండానే ఫ్రిజ్ లో పెట్టాలి.

7. అరటి పళ్ళను ఫ్రిజ్ లో పెట్టరాదు.    

 

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...