How to make Mutton
Sukka - మటన్ సుక్క
ఈరోజు బ్లాగ్లో మటన్ సుక్క మరియు ఔరంగాబాద్ మటన్ ఎలా వండలో చూద్దాం. ముందుగా మటన్
సుక్క గురించి చూద్దాం.
మటన్ సుక్క కావలసిన పదార్దాలు:
1.మటన్ – అర కిలో
2.ఉల్లిపాయ ముక్కలు-1 టేబల్ స్పూన్
3. అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టీస్పూన్
4. కారం – 1 టీస్పూన్
5. నువ్వుల పొడి - 1 టీస్పూన్
6. గసగసాలు - 1 టీస్పూన్
7. పల్లీల ముద్ద – 1 టీస్పూన్
8.మెుక్కజొన్న పిండి – 1 టేబల్ స్పూన్
9.గరం మసాల-2 టీస్పూన్స్
10.కొత్తిమీర - 1 కట్ట
11. పుదీనా -1 కట్ట
12.నూనె-సరిపడ
13. ఉప్పు -తగినంత
మటన్ సుక్క(Mutton Sukka) తయారీ విదానం:
v మటన్ ని శుబ్రంగా కడిగి
పక్కన పెట్టుకోవాలి.
v మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ
ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, నువ్వులపొడి గసగసాలు, పల్లీల ముద్ద, మెుక్క జొన్న
పిండి, గరంమసాలా, ఉప్పు, కారం, కొద్దిగా నీళ్ళు పోసి రుబ్బుకోవాలి.
v ఈ ముద్దను మటన్ లో కలిపి
ఒక పావుగంట నానబెట్టాలి. ఆ తరువాత మటన్ ముక్కల్ని ఎండలో పెట్టాలి.
v బాగా ఎండక పొయ్యమీద మందపాటి
గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక ఎండబెట్టి మటన్, ముక్కల్ని వేసి ఎర్రగా వేగించాలి.
చివర్లో కొత్తిమీరతో అలంకరించుకోవాలి.
2. How to make Aurangabad Mutton:
ఔరంగాబాద్ మటన్ కావలసిన పదార్దాలు:
1.మటన్ ముక్కలు- కిలో
2. నూనె – సరిపడ
3. ఉల్లిపాయలు -పావు కిలో
4. అల్లం వెల్లుల్లి – 4 టేబల్ స్పూన్స్
5. దనియాల పొడి - 3 టేబల్ స్పూన్స్
6.పసుపు-1 టీస్పూన్
7. కారం - 4 టీస్పూన్
8. కొత్తిమీర తురుము- టేబుల్ స్పూన్
9.ఉప్పు – తగినంత
గరం మసాలా కోసం:
10. యాలకులు- టీస్పూన్
11. దాల్చిన చెక్క – 2 అంగుళాల ముక్క
12. షాజీరా – టీస్పూన్
13. జాజికాయ పొడి – టీస్పూన్
14. లవంగాలు-టీస్పూన్
15. మిరియాలు-టీస్పూన్
ఔరంగాబాద్ మటన్ తయారి విదానం:
v గరంమసాలా కోసం తీసుకున్నవన్నీ
వేయించి పొడి చేయాలి.
v ప్రెషర్పాన్ లో నూనె వేసి
ఉలలిముక్కలు, అల్లం వెల్లుల్లి వేయించాలి.
v తరువాత మటన్ ముక్కలు, పసుపు
వేసి ఉడికించాలి.
v ఇప్పుడు దనియాల పొడి, కారం,
ఉప్పు, గరంమసాల వేసి కలిపి సిమ్ లో పెట్టి, సరిపడ నీళ్లు పోసి మాంసాన్ని మెత్తగా ఉడికించాలి
దించాలి.
v చివరిగా కొత్తిమీర తురుములో
అలంకారిస్తే సరి.
No comments:
Post a Comment