How to Make Kheema Mutten Masala-కీమా మటన్ మసాలా
ఈరోజు బ్లాగ్లో కీమా మటన్ మసాలా మరియు మటన్ కీమ కోఫ్తా కర్రీ ఎలా తయారి చేయాలో
చూద్దాం. ముందుగ కీమా మటన్ మసాలా చూద్దాం.
కీమా మటన్ మసాలా కావాలసిని పదార్దాలు:
కీమ మటన్ – అర కేజీ
కొత్తిమీర తరుగు – అర కేజీ
జీలకర్ర పొడి – అర టీస్పూన్
కారం – టీస్పూన్
ఉప్పు – తగినంత
కర్రీ కోసం
నూనె – టేబుల్ స్పూన్
జీలకర్ర – అరటీస్పూన్
ఉల్లిపాయలు-రెండు
పచ్చిమిర్చి -6
వెల్లుల్లి రేకులు – 6
అల్లం తరుగు - 2 టీస్పూన్స్
టామెటో గుజ్జు-2 టేబుల్ స్పూన్స్
పసుపు-చిత్తికెడు
గరం మసాల -టీస్పూన్
దాల్చినచెక్క – అగుళం ముక్క
యాలకుల పొడి – అర టీస్పూన్
నీరు – రెండు కప్పులు
పెరుగు – రెండు టేబుల్ స్పూన్స్
ఉప్పు తగినంత
కీమ మటన్ మసాలా తయారి
విదానం:
v అడుగు మందంగా ఉండే ఓ పాత్రను పొయ్యపై ఉంచి అందులో
నూనె పోసి, అది వేడెక్కక అందులో ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఉప్పు
వేసి లేత గోదుమ రంగు వెచెంతవరకు వేగించాలి.
v పచ్చిమిర్చి ముక్కలు, దనియాలు పొడి, జీలకర్ర పొడి,
గరం మసాలపొడి, అన్నీ వేసి కలపాలి.
v ఇప్పుడు మటన్ కీమ వేసి 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ
ఉండాలి.
v తరువాత ముప్పావు కప్పు వేడినీరు పోసి మంట పెద్దది
చేయాలి.
v ఉడికే స్తాయకి రాగానే పైన మూత పెట్టి, మంట తగ్గించి
ఉడికించాలి.
v తరువాత నానబెట్టిన పచ్చి బాటనిలు వేసి నిమ్మరసం పిండాలి.
v కాస్త దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించి దించేయాలి.
How to Make Mutton Kheema Kofta
Curry - మటన్
కీమ కోఫ్తా కర్రీ
మటన్ కీమ కోఫ్తా కర్రీ కావలసిన పదార్దాలు:
కీమ మటన్ – అర కేజీ
కొత్తిమీర తరుగు-అరకప్పు
జీలకర్ర పొడి -అర టీస్పూన్
కారం -టీస్పూన్
ఉప్పు -తగినంత
కర్రీ కోసం
నూనె -టేబుల్ స్పూన్
జీలకర్ర -అర టేబుల్ స్పూన్
ఉల్లిపాయలు-రెండు
పచ్చి మిర్చి-6
వెల్లుల్లి రెక్కలు -6
అల్లం తరుగు -2 టీస్పూన్స్
టామెటో గుజ్జు - 2 టేబుల్ స్పూన్
పసుపు -చిటికెడు
గరం మసాల-టీస్పూన్
దాల్చిన చెక్క-అంగుళం ముక్క
యాలకుల పొడి-అర టీస్పూన్
నీరు -రెండు కప్పులు
పెరుగు-రెండు టేబుల్ స్పూన్స్
ఉప్పు-తగినంత
మటన్ కీమ కోఫ్తా తయారి విదానం:
v ఉల్లిపాయ తరిగి కొద్దిగా
నూనెలో దోరగా వేగించాలి, అల్లం-వెల్లుల్లితో కలిపి రుబ్బుకోవాలి.
v నీరు వాడకట్టిన కీమాలో కొత్తిమీర
కారం, జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి నిమ్మకాయంత ఉండలు చేసుకొని పక్కనుంచాలి.
v నూనెలో జీలకర్ర, పచ్చిమిర్చి,
అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేగించాలి.
v టమేటా గుజ్జు, పసుపు, గరంమసాల,
దాల్చినచెక్క, యాలకుల పొడి, ఉప్పు, నీరు కాలిపి మరిగించాలి.
v ఇప్పుడు కీమ ఉండల్ని మెల్లగా
అందులో వేసి చిన్న మంటపై (గరితతో కాలపకుండా) గంటన్నర సేపు ఉడికించాలి.
v కూర చిక్కబడ్డాక పెరుగు
వేసి కొత్తిమీర తో అలంకరించిదించేయాలి.
v రోటీ నాన్ తో ఎంతో రుచిగా
ఉండే కోఫ్తా కర్రీ.
No comments:
Post a Comment