Wednesday, November 16, 2022

How to Make Fish Coconut Curry & How to Make Chilli Fish Fry

 How to Make Fish Coconut Curry y-ఫిష్ కోకోనట్ కర్రీ

ఈరోజు బ్లాగ్లో ఫిష్ కోకోనట్ కర్రీ మరియు చిల్లీ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.ముందుగ ఫిష్ కోకోనట్ కర్రీ గురించి చూద్దాం.

fish fry


ఫిష్ కోకోనట్ కర్రీ (Fish Coconut Curry) కావలసిన పదార్దాలు:

1.ఛేప ముక్కలు – అర కేజీ

2. కొబ్బరి పాలు – అర కప్పు

3. టమేటా గుజ్జు – కప్పు

4. ఉల్లిపాయలు-రెండు

5. అల్లం తరుగు – టీస్పూన్

6. వెల్లుల్లి తరుగు-టీస్పూన్

7. పచ్చిమిర్చి – ఆరు

8. కరివేపాకు – గుప్పెడు

9. ఆవాలు, మెంతులు – టీస్పూన్ చొప్పున

10. పసుపు-పావు టీస్పూన్

11. కారం, దనియాలు పొడి-టీస్పూన్ చొప్పున

12. నీరు-కప్పు

13. నూనె – 2 టేబల్ స్పూన్

14. ఉప్పు – తగినంత


ఫిష్ కోకోనట్ కర్రీ (Fish Coconut Curry) తయారి విదానం:

o   కడాయిలో ఆవాలు, మెంతులు, అల్లం, వెల్లులి, ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు (సగం ), పసుపు, కారం, దనియాలు పొడి ఒకదాని తరువాత ఒకటి వేగించి టమేటా గుజ్జు కలపాలి.

o   20 నిమిషాలు తర్వాత చేప ముక్కలు, నీరు కలిపి ముక్కలు ముప్పావు బాగం ఉడికిన తర్వాత కొబ్బరిపాలు,ఉప్పు వేసి సన్నని మంటపై ఉంచాలి.

o   కూర చిక్కబడ్డాక మిగిలిన కరివేపాకు వేసి మూత పెట్టాలి.

 

How to Make Chilli Fish Fry

చిల్లీ ఫిష్ కి కావలసిన పదార్దాలు:

1.చేప -పావుకేజీ

2. నిమ్మకాయ -ఒకటి

3. అల్లం పేస్ట్ -2 టేబల్ స్పూన్

4. వెల్లుల్లి పేస్ట్ - 2 టేబల్స్ స్పూన్

5.వాము-2 గ్రామ్స్

6. పచ్చిమిరపకాయలు – 5

7. దనియాలు-5 గ్రామ్స్

8. దానిమ్మ గింజలు పొడి -5 గ్రామ్స్

9. నల్ల ఉప్పు -2గ్రామ్స్

10. నీరు వాడకట్టిన పెరుగు-1 టేబల్ స్పూన్

11. నూనె – రెండు టేబల్ స్పూన్స్

12. జీలకర్ర – తగినంత

13. ఉప్పు-తగినంత


చిల్లీ ఫిష్ ఫ్రై తయారి విదానం:

o   చేప ముక్కలను శుబ్రంగా కడికి నీటిని వాడకట్టి అల్లం-వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసం కలిపి కొంచెం సేపు నానబెట్టుకోవాలి.

o   నూరి ఉంచుకున్న పచ్చిమిరపకాయల ముద్ద, దనియాల పొడి, దానిమ్మ పొడి, వాముని కూడ చేప ముక్కలని పట్టించాలి. చేప ముక్కలని అలాగే 2 గంటలు నాననివ్వాలి.

o   ఇప్పుడు పాన్ లో నూనె వేసి కాగిన తరువాత చేప ముక్కలను ఒక్కకటిగా వేయించుకోవాలి.

o   ఎలా చేసిన చేప వేపుడు చూడటానికి పచ్చగా, కోతికింపుగా ఉండటమే కాక కొత్త రుచిని మీకందిస్తుంది.

 

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...