Tuesday, November 15, 2022

How to Make Chinthachiguru pacchi Rayyalu & How to Make Chinthakaya Royyalu

 How to Make Chinthachiguru pacchi Rayyalu ఛింతచిగురు పచ్చిరొయ్యలు

ఛింతచిగురు పచ్చిరొయ్యలు మరియు ఛింతకాయ రొయ్యలు

ఈరోజు బ్లాగ్లో ఛింతచిగురు పచ్చిరొయ్యలు మరియు ఛింతకాయ రొయ్యలు ఎలా వాండాలో చూద్దాం. ముందుగా చింతచిగురు పచ్చి రొయ్యలు గురించి చూద్దాం.

Chinthachiguru pacchi Rayyalu


1.చింతచిగురు పచ్చి రొయ్యలు (Chinthachiguru pacchi Rayyalu) కావలసిన పదార్దాలు:

1.చింతచిగురు – 1/4 కేజీ

2. పచ్చి రొయ్యలు – అర కేజీ

3. ఉల్లిపాయలు – రెండు

4. పచ్చి మిర్చి – 6

5. నూనె – టేబల్ స్పూన్

6. పసుపు – అర టీస్పూన్

7. కారం – టీస్పూన్

8. ఉప్పు – తగినంత


చింతచిగురు పచ్చి రొయ్యలు (Chinthachiguru pacchi Rayyalu) తయారి విదానం:

o   పచ్చిరొయ్యలు, చింతచిగురు విడివిడిగా శుబ్రం చేసి ఉంచుకోవాలి.

o   నూనె లో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు దోరగా వేగించి, పసుపు, రొయ్యలు వేసి మగ్గనివ్వాలి.

o   రొయ్యలు ముడు వంతులు ఉడికిన తరువాత చింతచిగురు, కారం, ఉప్పు కలిపి రెండు నిమిషాలు తరువాత కప్పు నీరు పోసి మూత పెట్టాలి. కూర చిక్కబడ్డాక దించేయాలి.

 

2. How to Make Chinthakaya Royyalu - చింతకాయ రొయ్యలు

చింతకాయ రొయ్యలు (Chinthakaya Royyalu) కావలసిన పదార్దాలు:

1.రొయ్యలు-అర కేజి

2. చింతకాయ ముక్కలు-100 గ్రామ్స్

3. ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు

4. అల్లం-వెల్లులి ముద్ద - 1 టీస్పూన్

5. గరం మసాల – 1 టీస్పూన్

6. కారం – 2 టీస్పూన్స్

7. కరివేపాకు-2 రెబ్బలు

8.పసుపు-అర టీస్పూన్

9. నూనె – సరిపడ

10. ఉప్పు – తగినంత


చింతకాయ రొయ్యలు తయారి విదానం:

o   ముందుగా రొయ్యలి శుబ్రంగా కడికి పెట్టుకోవాలి.

o   లేత చింతకాయ ముక్కల్ని రోట్లో దంచుకొని పక్కన పెట్టుకోవాలి.

o   ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెటుకొని నూనె వేసి వేడెక్కక ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి, కరివేపాకు వేసి ఎర్రగా వాయించుకోవాలి.

o   ఇందులో ఉప్పు, కారం, పసుపు, రొయ్యల్ని వేసి కలపాలి.

o   ఓ పది నిమిషాలు సన్నని మంటపై మగ్గక దంచిపెట్టుకున్న చింతకాయ ముద్దను కూడ వేసి బాగా కలపాలి.

o   ఇప్పుడు గరం మసాల వేసి 5 నిమిషాలు ఉడికించి దించేయాలి.

o   దీన్ని కొత్తిమీర తురుముతో అలకరించుకోవాలి.


No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...