How to Make Chicken Liver Fry - చికెన్ లివర్ ఫ్రై
ఈరోజు బ్లాగ్లో చికెన్ లివర్ ఫ్రై మరియు మటన్ లివర్ ఫ్రై ఎలా ఉండలో చూద్దాం. ముందుగ
చికెన్ లివర్ ఫ్రై తయారీచేయడం చూద్దాం.
1.చికెన్ లివర్ కి (chicken liver fry)కావలసిన పదార్దాలు:
1. చికెన్ కార్జం – అర కిలో
2. ఎగ్స్ – 4
3.పెద్ద ఉల్లిపాయలు – 2
4. పచ్చిమిచ్చి – 2
5. మసాల పౌడర్ – 1 స్పూన్
6. అల్లం వెల్లులి పేస్ట్ - 1 స్పూన్
7. కరిపాకు – తగినంత
8. కొత్తిమీర – తగినంత
9. కారం - 1 స్పూన్
10. నూనె – 1 టేబల్ స్పూన్
11. ఉప్పు – తగినంత
చికెన్ లివర్ ఫ్రై (Chicken Liver Fry) తయారి విదానం :
- చికెన్ కార్జం ముక్కలు నీళ్ళు పోసి కడగాలి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
- పొయ్యమీద బణని ఉంచి నూనె కాగిన తరువాత ఉల్లిముక్కలు, పచ్చి మీరప ముక్కలు, కరివేపాకు అన్నీ సన్నగా తరిగినవి వేసి కొంచెం సేపు వేయించాలి.
- తరువాత కార్జం ముక్కలు వేసి బాగా గట్టి పడేవారకు వేయించాలి.
- ఎగ్స్ ఉడకబెట్టి చక్రాలుగా కోసి వేయించాలి.
- ఉప్పు, కారం, పసుపు ముక్కలు వేయాలి.
- అల్లం వెల్లులి పేస్ట్, మసాల పౌడర్ తరువాత వేసి వేగనివ్వాలి.
- దించబోయే ముందు కారం వేయాలి. కొత్తిమీర పైన చల్లాలి.
2. How to Make Mutton Liver Fry - మటన్ లివర్ ఫ్రై
మటన్ లివర్ ఫ్రై (Mutton Liver Fry) కావలసిన పదార్దాలు:
1.లివర్ ముక్కలు – అర కేజీ
2. పసుపు – అర టీస్పూన్
3.కారం -టీస్పూన్
4. దనియాల పొడి -టేబల్ స్పూన్
5. మిరియాల పొడి – అర టీస్పూన్
6.ఉల్లితరుగు- అర కప్పు
7. టమేటాలు – 3
8. అల్లం వెల్లులి పేస్ట్ -టేబల్ స్పూన్
9.దాల్చినచెక్క – అంగుళం ముక్క
10. లవంగాలు – నాలుగు
11. కరిపాకు – 4 రెబ్బలు
12. నూనె - టేబల్ స్పూన్
13. ఉప్పు – తగినంత
మటన్ లివర్ ఫ్రై (Mutton Liver Fry) తయారి విదానం:
- నూనెలో దాల్చినచెక్క, లవంగాలు, ఉల్లితరుగు, అల్లం- వెల్లులి పేస్ట్ వేసి వేగించాలి. తరువాత టమేటా ముక్కలకు ఉప్పు కలపాలి.
- ముక్కలు మెత్తబడ్డాక కారం, దనియాల పొడి, కరిపాకు, పసుపు వేసి 2 నిమిషాలు తరువాత లివర్ ముక్కలు వేసి పావు కప్పు నీరు పోసి, మూత పెట్టి చిన్ని మంట పై ఉడికించాలి.
- 15 నిమిషాలు తరువాత (నీరు ఆవిరయ్యాక ) కొత్తిమీర చల్లిదించేయాలి. (ఎక్కువ సేపు ఉడికిస్తే ముక్కలు గట్టిపడిపోతాయి).
No comments:
Post a Comment