Thursday, November 3, 2022

How to Make Chepala Iguru & Korameenu Perugu Pulusu-చేపల ఇగురు మరియు కొరమీను పెరుగు పులుసు

 

How to Make Chepala Iguru - చేపల ఇగురు


ఈ రోజు బ్లాగ్ లో చేపల ఇగురు మరియు కొరమెను పెరుగు పులుసు గురించి తెలుసుకుందాం. ముందుగ చేపల ఇగురు గురించి చూద్దాం.


చేపల ఇగురుకి కావలసిన పదార్దాలు:


1. చేపలు – అర కిలో

2. ఉల్లిపాలియలు -4

3. అల్లం-వెల్లులి పేస్ట్ – 1 టేబల్ స్పూన్

4. లవంగాలు – 5

5. దాల్చినచెక్క – 2

6. గసగసాలు – 2 స్పూన్స్

7. దనియాలు – 2 టేబల్ స్పూన్స్

8. జీలకర్ర – అర టీస్పూ

9. పసుపు – చిటికెడు

10. కారం – 4 టీ స్పూన్

11. కరిపాకు – ఒక రెబ్బ

12. నూనె – తగినంత

13. కొత్తిమీర – ఒక కట్ట

14. ఉప్పు – తగినంత


చేపల ఇగురు తయారీ విదానం (chapala iguru preparation method) :


·      లవంగాలు, దాల్చినచ్చేక, దనియాలు, జీలకర్రని మిక్సీలో వేసి పొడిచేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గసాగసాల్నికూడ మెత్తగా పొడిచేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయలు ముక్కలు మిక్స్ లో వేసి అందులో గసాగసాల పొడి కూడ వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

·      చేప ముక్కల్ని శుబ్రంగా కడికి పసుపు రాసి పక్కన పెట్టుకోవాలి.

·      ఇప్పుడు పొయ్యమీద వెడల్పటి గిన్నె పెట్టి, సరిపడా నూనె వేయాలి.

·      నూనె బాగా కాగాక కర్రిపాకు, అల్లం-వెల్లులి ముద్ద వేసి వాయించాలి. తరువాత ఉల్లిపాయ ముద్ద వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముద్ద కూడ వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి.

·      ఇపుడు కారం, ఉప్పు, పసుపు, మసాలపొడి వేసి బాగా కలపాలి.

·      ఇప్పుడు చేప ముక్కల్ని కూడ వేసి కొద్దిగా నీళ్ళు పోసి సన్నని మంట పై ఉడకనివ్వాలి.

·      ముక్కలు బాగా ఉడికిన తర్వతా దించేసి కొత్తిమీరతో అలంకరించుకోవాలి.


 How to Make koramenu Perugu Pulusu - కొరమీను పెరుగు పులుసు

కొరమీను పెరుగు పులుసు ఎలా వండలో చూద్దాం.

కొరమీను పెరుగు పులుసు కావలసిన పదార్దాలు:

1.కొరమీను చేప (చర్మం లేనిది)-కిలో

2. నూనె -అర కప్పు

3. పెరుగు – కప్పు

4. ఉల్లిపాయలు -రెండు

5. టమేటాలు – నాలుగు

6. వెల్లులి తరుగు – అర టీ స్పూన్

7. అల్లం తరుగు – టీ స్పూన్

8. పచ్చిమిర్చి – ఆరు (నిలువుగా చీరలి )

9. కొత్తిమీర – టేబల్ స్పూన్

10. కారం – రెండు టేబల్ స్పూన్స్

11. పసుపు -పావు టీ స్పూన్

12.ధనియాల పొడి – టీ స్పూన్

13.కసూరి మేధి – టీ స్పూన్

14. గరం మసాల – టీ స్పూన్

15. ఉప్పు – తగినంత


కొరమీను పెరుగు పులుసు తయారీ విదానం(koramenu Perugu Pulusu):


·      చేపను శుబ్రపరచి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.

·      ఉప్పు, కారం, పసుపు, దనియాల పొడి, కసూరి మేధి, గరంమసాల, అల్లం, వెల్లులి పేరుగులో వేసి బాగా కలిపి చేప ముక్కలకు పట్టించి అరగంట సేపు పక్కనుంచలి.

·      కాడయీలో ఉల్లి తరుగు దోరగా వేగాక టమేటా ముక్కలు, చేప ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉడికించాలి.

·      చేప ముక్కలు ఉడికి నూనె పైకి తెలినప్పుడు కొత్తిమీర చల్లి దించేయలి.

     

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...