Sunday, October 9, 2022

How to Make Mutton Kurma మటన్ కూర్మ -నాన్ వెజ్ కర్రీస్

 How to make Mutton  Kurma  – మటన్ కూర్మ 

మటన్ కూర్మ కావలసిన పదార్దాలు -mutton kurma :

నూనె                                                     అరకప్పు 

ఉల్లిపాయలు(తరిగినవి)                    1  

మటన్                                           ముప్పావు కేజీ

పెరుగు                                          4 టీస్పూన్లు

నీళ్ళు                                            1 కప్పు

దనియాలపొడి                                 2 టీస్పూన్లు

కారం                                             1 టీస్పూన్లు

అల్లం-వెల్లులి పెస్ట్                             2 టీస్పూన్లు

లవంగాలు                                      4

యాలుకలు                                     2

దాల్చిన చెక్క                                  3 అంగుళాల ముక్కలు

ఉల్లిపాయ ముక్కలు (వేగిచిన)             2 టీస్పూన్లు

ఉప్పు                                            తగినంత

  

మటన్ కూర్మ తయారీచేయు విదానం preparation of mutton kurma  :

Ø ఒక గిన్నెలో నునె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి.

Ø అవి వేగిన తరువాత మటన్, పెరుగు, ఉప్పు, నీళ్లు  ధనియాల పొడి, కారం వేసి బాగా కలపాలి.

Ø కొద్దిసేపటి తరువాత అల్లం-వెల్లుల్లి పెస్ట్, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు వేసి సన్నని  మంట పై అరగంట సేపు ఉడికించాలి.

Ø తరువాత వేగించుకున్న ఉల్లిపాయలు వేసి మటన్ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి.

Ø దీన్ని చపాతీ రొటీలో తింటే చాలా రుచిగా ఉంటుంది.

 How to Make Mutton paaya- మటన్ పాయా 

మటన్ పాయ కావలిసిన పదార్దాలు

మేక లేద పొట్టేలు కాళ్ళు               నాలుగు

ఉల్లిపాయలు                              రెండు

టమెటాలు                                రెండు

అల్లం-వెల్లులి పేస్ట్                        టెబుల్ స్పూన్

ధనియాల పొడి                           టీ స్పూన్

కారం                                       టీ స్పూన్

పసుపు                                    టీ స్పూన్               

నూనె                                      స్పూన్

కొత్తిమీర                                   కట్ట                 

లవంగాలు                                నాలుగు

దాల్చిన చెక్క                             అంగుళ్ళం ముక్క

బిర్యాని ఆకులు                                   రెండు

సోంపు                                                రెండు టీస్పూను

కొబ్బరిపాలు                                       పావు కప్పు

ఉప్పు                                                తగినంత

 

మటన్ పాయ తయారీ విధానం – preparation of  mutton paaya :

Ø శుభ్రం చేసిన మేక కాళ్ళను 2 అంగుళాల ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

Ø కుక్కర్లో ఉల్లితరుగు, అల్లం వెల్లులి పేస్ట్, టమోట ముక్కలు, ధనియాలు పొడి, పసుపు, ఉప్పు, కారం ఒకటి తర్వాత ఒకటి వేగించాలి.

Ø ఈప్పుడు మటన్ ముక్కలుతో పాటు రెండు కప్పుల నీరు పోసి కొత్తిమీర తరుగు కూడ వేసి 5 విజిల్స్ వచ్చేవరకు ఉంచండి.

Ø కుక్కర్ మూత తేయకుండా 2 నుంచి 5 గంటలు ఉంచాలి.(ఈల చేయడం వలన ఎముకలలో ఉన్న రసం కర్రీ లోకి దిగుతుంది).

Ø తరువాత పాయని వేడిచేసి కొబ్బరిపాలు కలపాలి.  చివరిగా కొద్దిగా నూనెలో వేగించి లంగాలు, బిర్యానీ ఆకులు దాల్చినచెక్క, సోంపును పాయాలో కలిపిదించేయ్యాలి. ఈది బ్రెడ్, చపాతీ, దోశ దేనితో తిన్న ఎంతో రుచిగా ఉంటుంది.

 

వంటింటి టిప్స్ – kitchen tips :

v పుదీనా ఆకులు నూనె తో వేగిస్తే ముద్దగా అవుతుంది. దానికి ఉప్పు, పులుపు చేర్చి రుబ్బితే పుదీనా పచ్చడి తయారౌతుంది. మూడు, నాలుగు రోజులు నిల్వ ఉంటుంది. దీని తరచు బోజనం వాడుతుంటే కడుపులో నుశీ పురుగులు పెరగవు. మంచి ఆకలి పుట్టిస్తూంది.

 

v పకోడీలు కరకరాలడాలంటే ఉల్లిపాయలు ముక్కలు మీద కొంచం ఉప్పు వేసి బాగా కలిపి తరవాత, శనగపిండి తో కలిపి పకోడీలు వేయండి.

 

 

v వంకాయముక్కలను బియ్యం కడుగు నీళ్ళ తో కదిగితే ఆవినల్లబడవు.

 

v రుచికరంగా చారును తయారుచేయలెంటే దాంట్లో ఒక టమోటో, రెండు ములక్కడలు ముక్కలు కూడ వెయ్యండి. దానికి కొత్తిమీర మరియు కరేపకు చేరిస్తే మరింత రుచిగా ఉటుంది.

 

v అరటి పువ్వును ముక్కలు గ తరిగి దంచేటప్పుడు కొంచెం పసుపు వేస్తే అది నల్ల బడకుండా ఉంటుంది. ఈది చాలా ఆరోగ్యకరమైనది. నెలకు ఒకసారి అయిన తప్పకతినాలి.

 

v పొట్లకాయని చక్రల్ల గ తరిగి ఒక చెంచాడు ఉప్పువేసి పది నిమిషాలు తర్వాత చేతితో నాలిపి, రసం పిండివేయాలి. అంధువలనా వాసన, వేగటుతనం తగ్గుతాయి. తరువాత కూరగానో, మజ్జిగ గానో, పులుసుగానో, కూరగానో ఉపయోగించడీ.

 

v కోడిగ్రుడు కోనభాగం నేలమీద ఉండేలా దాన్ని త్రి ప్పండి. అది తిరగకుండా పడిపోతే అది తాజా గ్రుడు. సరిగా తిరిగితే అది ఉడకబెట్టిన గ్రుడు.

 

v గ్రుడును ఉడకబెట్టిన వేంటేనే చన్నీళ్ళో వేస్తే పై పెకు సులభం గా తీయవచు.

 

v ఆకు కూరల్లీ కూడ కడిగి అరబెట్టాలి. తరువాత కట్టలు వెడదీసి వాటి మొదళ్ళను కత్తిరీచి పాలధీన్ కవారు లో పెట్టి ప్రీజ్ లో ఉంచండి. రెండు రోజులు వరకు తాజాగా ఉంటాయి.

 

v కెరెట్, బీట్ రూట్, భఠని etc వాటిని ఉడికించి నీళ్ళ లో కొంచెం పంచదార వేస్తే వాటి సువాసన పోకుండా ఉంటుంది.

 

v చపాతీలు చేసేటపుడు గోదూమపిండిని నీళ్ళకు బదులుగా పాలు పోసి కలిపితే చపతిలు మెత్తగ ఉంటాయి.

 

v కూర లో ఉప్పు ఎక్కువైతే గోదూమపిండితో ముడు లేద నాలుగు ఉండలు చేసి వేయాలి. కూర ఉడికిన తరువాత ఆ ఉండలు తీసివేయండి.

 

    

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...