Wednesday, December 21, 2022

Donga Pilli-panchatantra kadhalu దొంగ పిల్లి

 Donga Pilli-panchatantra kadhalu దొంగ పిల్లి

 భగీరధి నది ఒడ్డున పెద్ద జువ్వి చెట్టు ఉంది. ఆ చెట్టు త్వరలో నగీలా ముసలి గ్రద్ద ఉండేది.  ఆ గ్రద్దకు కళ్ళు కనిపించవు. అందుకనే ఆ చెట్టు మీద ఉండే పక్షులు తమకు తెచ్చుకున్న ఆహారము లో  కొంత పెట్టేవి. అ గ్రద్ద పక్షులు బయటికి వెళ్ళినప్పుడు. వాటి పిల్లలకు మంచి మంచి కథలు చెప్పి నిద్ర పుచ్చేవి.

ఒకరోజు దీర్ఘకర్ణుడు అనే పేరుగల పిల్లి పక్షుల పిల్లల్ని తినటానికి ఆ చెట్టు పైకి చేరింది.  ఆ పిల్లిని చూసి  పక్షి పిల్లలు భయంతో అరియిచాయీ అరుపులు విన్న నగీలా తొర్రలోంచి బయటకు వచ్చి ఎవరక్కడ అరిచింది.

దొంగ పిల్లి


ఆ అరుపుకి పిల్లి పై ప్రాణాలు పై నే పోయాయి.  తప్పించుకోవడానికి దానికి దారి కనిపించలేదు. ఏదైతె అది అనుకోని అయ్యా నా పేరు దీర్ఘకర్ణుడు.  నేను పిల్లిని అని చెప్పింది.

వెంటనే నగీలా నీవు పిల్లి వా ముందు ఈ చెట్టు దిగి వెళ్ళిపో లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను అంటూ హెచ్చరించింది.

అయ్యా కోపగించుకోకండి.  నేను పుట్టింది పిల్లి జాతి అయినా నాకు ఆ జాతి బుద్దులు మాత్రం రాలేదు.  నేను మాంసం తినను పైగా బ్రహ్మచారిణీ ఇక్కడి. పక్షులు మీరు చాలా మంచివారు అని చెప్పుకోవటం విని. మీతో స్నేహం చేయాలి అని వచ్చాను అంది.

దీర్ఘకర్ణుడు మాటలకు నగీలా సంతోషించి.

ఆ రోజు నుండి రెండు మంచి మిత్రులు అయ్యాయి. ప్రతిరోజు దీర్ఘకర్ణుడు సాయంత్రం పూట నగీలా దగ్గరకు వచ్చి ఒక గంట సేపు కబుర్లు చెప్పి వెళ్లిపోతుంది.

కొన్ని రోజులు గడిచిపోయాయి.

చెట్టు పై నున్న పక్షులు తమ పిల్లలు మాయమవుతున్నాయి ఈ సంగతి తెలుసుకున్న. అవన్నీ ఒక రోజు కలిసికట్టుగా వచ్చి నగీల తమ పిల్లలు మాయం అయిపోతున్నాయి  అన్న విషయం అడిగాయి. నగీలా తనకే పాపం తెలియదని చెప్పింది.

పక్షులు నగీలా లోపలకు వెళ్లి చూశాయి.  తొర్ర నిండా పక్షుల ఈకలు బొమికలు కనిపించాయి. అవన్నీ దీర్ఘకర్ణుడు పక్షి పిల్లలను చంపి తిని నగీలా తొర్రలో తెలివిగా పడేసినవి.

పక్షాలు అన్ని నగీలా నే తమ పిల్లలను తింటుంది.  అనుకునే ఆముసలి గ్రద్దను సూటిగా ఉండే ముక్కులు తో పొడిచి పొడిచి చంపాయి. మాంసాహారి అని తెలిసి దాన్ని మాయమాటలు నమ్మి దానిని చెట్టు పై కి రాణించినందుకు నాకు తగిన శాస్తి  జరిగింది.  నాకు అని ఏడుస్తూ ముసలి గ్రద్ద  ప్రాణాలు విడిచింది.

కధలో నీతి:

చూసారా పుట్టుకతో వచ్చిన బుద్ది పుడకలతో గానీ పోదు. పిల్లి మాటలు నమ్మినందుక. ఆ గ్రద్ద ఎలాంటి ఆపద వచ్చిందో. అందుకే మనకి తెలియని వాళ్లు చెప్పే మాటలు మనం నమ్మరాదు.  నమ్మితే నగీలా మనం కూడ చిక్కులో పడతాం.


No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...