అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story
ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు
చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు వచ్చాడు బీర్బల్.
బీర్బల్ను చూసి అక్బర్ చక్రవర్తి " బీర్బల్ నీకు ఎవరైనా సవతి సోదరులుంటే
తీసుకు వచ్చి నాకు పరిచయం చేయకూడదా? " అని అన్నాడు.
బీర్బల్ అలాగే అన్ని తలూపాడు. మర్నాడు అక్బర్ చక్రవర్తి సభలో ఉండి ఏదో
నేర విచారణ నిమిత్తం తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇంతలో ద్వారం దగ్గర ఏదో శబ్దం
వినిపించింది. సహా అందరూ ద్వారం వైపు చూశారు. అక్కడ బీర్బల్ కనిపించారు. అందరూ
తలలు తిప్పేసుకుని ఆలోచిస్తున్నారు. కానీ ఎంతసేపటికీ బీర్బల్ లోన్ కు రాకపోవడంతో
మళ్లీ అందరూ ద్వారం వైపు చూశారు.
బీర్బల్ ఎదో బలవంతంగా లాగుతున్నాడు. అందరూ అటు వైపు ఆసక్తిగా
చూడసాగారు. బయటినుండి ఏదో శబ్దం వినబడుతుంది. బీర్బల్ ఒకపక్క నుండి లాగుతున్నాడు. కానీ
ఎంతకీ అటు వైపు ఉన్నది కాస్త కూడా ఇటు వైపు రావడం లేదు. చేతిలోని బలాన్ని కేంద్రీకరించి
కొన్ని ఒక్క లాగు లాగాడు బీర్బల్.
అ లాగుడికి అవతల వైపు ఉన్నా దేదో కదిలింది. బీర్బల్ మాత్రం విసురుగా
లోనకు వచ్చి పడ్డాడు. అతడితో పాటు వచ్చిన దానినే చూస్తూనే అంతా ఆశ్చర్యపోయారు.
ముందుగా చేరుకున్నా చక్రవర్తి కిందపడ్డా బీర్బల్ను చూస్తూ. "
బీర్బల్ ఏమిటిది? " అని అడిగాడు.
"
ఏం చెప్పను మహారాజా ! దీని దుంపతెగ చూడడానికి ఇలా కనిపిస్తుందా?
బలం ముందు దీనికి" అనే చెప్పాడు. బీర్బల్.
"
అది సరే! దీనిని ఎందుకు తెచ్చావ్"
"
మీరే గా నీ సవతి సోదరుడిని కలవడానికి తీసుకురా? అని అడిగారు" అని చెప్పాడు బీర్బల్.
"
నేనా? నేను దీనితో కలవడం ఏమిటి?" అని ఆశ్చర్యంగా అన్నాడు చక్రవర్తి.
అదేమిటి మహారాజా అప్పుడే మర్చిపోయారా? నిన్న నాకు ఎవరైనా సవతి సవతి సోదరులు ఉంటే తీసుకురా... అన్నారుగా?
"
అంటే..!"
"
అందుకే దీనిని తీసుకు వచ్చాను"
అక్బర్ చక్రవర్తి బీర్బల్ మాటలకు తల పట్టుకున్నాడు. నేను అన్న మాటకూ
దీనికి సంబంధం ఏమిటి?. అన్నాడు అక్బర్ చక్రవర్తి అయోమయం నుంచి తేరుకుంటూ.
"
సంబంధం ఉంది మహాప్రభు! నేను చిన్నప్పుడు గేద పాలు తాగేవాడిని ఇది
కూడా నాతో పాటే గెద పాలు తాగేది. అంటే మీము ఇద్దరం సవతి సోదరులమెగా ?
" అన్నాడు తనతోపాటు తెచ్చిన దూడను ప్రేమగా నిమురుతూ.
అక్బర్ చక్రవర్తి ఆ మాటలు విని ఆశ్చర్యపోయి గా. సభ లోని వారు పగలబడి
నవ్వారు.